ఆ రెండు లేకుండా చిరంజీవి కొత్త సినిమా.. జనాల పరిస్థితి ఏంటో?

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ అంటే జనాలకు చాలా ఇష్టం.. ఆ రెండు కోసం ఆయన సినిమాలు చూస్తారు జనాలు.. అందుకే చిరు సినిమాలకు జనాల్లో మంచిది క్రేజ్ ఉంది.. డ్యాన్స్, ఫైట్స్ అంటే ఇలా ఉండాలి అని అందరికీ చూపించాడు చిరు.. అందుకే చిరు అందరికి ఆదర్శంగా నిలిచాడు.. ఇక అందరు ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడిచారు , సక్సెస్ అయ్యారు.. ఇప్పటికి యువతం చిరును ఆదర్శంగా తీసుకొని సినిమాల్లోకి వస్తున్నారు.. ఇప్పుడు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. చిరు తర్వాత చేయబోయే సినిమాలో ఆ రెండు లేవని వార్తలు నెట్టింట తెగ షికారు చేస్తుంది..

చిరంజీవి
చిరంజీవి

ఇకపోతే చిరు సినిమాలకు ఇప్పటికి డిమాండ్ ఉంది.. ఈ ఏడాది ప్రారంభం లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో అందరూ చూసారు.ఇది కేవలం ఒక మామూలు మెగాస్టార్ కమర్షియల్ సినిమా మాత్రమే, కానీ కలెక్షన్స్ మాత్రం ఆల్ టైం టాప్ 5 రేంజ్ లో చేసింది. ఫుల్ రన్ లో 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆయన మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేసాడు.. దాదాపు అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 11 వ తారీఖున విడుదల కాబోతుంది…

Chiranjeevi

ఈ సినిమా తర్వాత చిరంజీవి కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా , వసిష్ఠ తో ఒక సినిమా ప్రారంభించాడు. వీటిల్లో ముందుగా కళ్యాణ్ కృష్ణ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రం లో చిరంజీవి తో పాటుగా డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.. ఈ సినిమాలో విలన్ ఉండదట, ఫైట్స్ కూడా ఉండవట. పూర్తి స్థాయి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. ఫైట్స్ లేని చిరంజీవి సినిమాని జనాలు ఊహించుకోలేకున్నారు.. మరి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here