మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీ కి వచ్చిన ప్రతీ ఒక్కరు గ్రాండ్ సక్సెస్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. గత దశాబ్దం లో వచ్చిన వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ కూడా సక్సెస్ అయిపోయారు. కానీ లేడీస్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల హీరోయిన్ గా ట్రై చేసి సక్సెస్ కాలేకపోయింది.

ఇప్పుడు ఆమె వాళ్ళ నాన్న లాగానే నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను నిర్మిస్తుంది. అలాగే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టి పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను నిర్మించింది. ఒక్క సక్సెస్ కూడా రాలేదు. అలా మెగా కుటుంబం నుండి వచ్చిన ఈ ఇద్దరు ఆడవాళ్లు సక్సెస్ కాలేకపోయారు. కానీ సుస్మిత చిరంజీవి కి వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది, ఆ ఒక్క విషయం లో మాత్రం ఈమె సక్సెస్ అయ్యింది.

అయితే గతం లో ఈమెని చిరంజీవి ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు అయితే చేసాడట. అప్పట్లో ఉదయకిరణ్ హీరో గా, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఒక సినిమా ఓకే అయ్యింది. ఈ సినిమా ద్వారానే సుస్మిత ని ఇండస్ట్రీ కి పరిచయం చేద్దాం అనుకున్నాడట పూరి జగన్నాథ్. సుస్మిత కి ప్రత్యేకంగా ఫోటో షూట్స్ కూడా చేసారు, అంత ఓకే అనుకున్నాక, చిరంజీవి స్క్రిప్ట్ విన్నప్పుడు ఎందుకో సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తుంది అనే సందేహాన్ని వ్యక్త పరిచాడట.

ఇలా డౌట్ ఉన్నప్పుడు ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదని , పూరి జగన్నాథ్ ఈ సినిమాని ఆపేసాడు. అయితే ఉదయ్ కిరణ్ పరిచయమైన ఆ కొద్దీ రోజులకే సుస్మిత కి అతనితో మంచి స్నేహం ఏర్పడింది. చిరంజీవి కి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉందనే కోరికని బయటపెట్టింది. ఆ తర్వాత చిరంజీవి ఉదయ్ కిరణ్ తో మాట్లాడి వీళ్లిద్దరికీ పెళ్లి కుదిరించడం, నిశ్చితార్థం చెయ్యడం, కొన్ని అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ అవ్వడం అన్నీ అలా జరిగిపోయాయి.