త్వరలోనే మెగా ఫ్యామిలీ కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ పెళ్లితో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే బ్యూటీఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. వారిద్దరి పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. కానీ వారి పెళ్లి పనుల గురించిన ఏ విషయాన్ని బయటకు రాకుండా పనులన్నీ పూర్తి చేసేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే ఈసారి నిహారిక పెళ్లిలో జరిగిన తప్పు.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ అన్న మెగాస్టార్ చిరంజీవి – తమ్ముడు నాగబాబుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట.

నాగబాబు కూతురు నిహారిక వివాహ జీవితం ఇలా తయారవడానికి కారణం ఆమె పెళ్లి ముహూర్తమే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. వీళ్ల ఫోటోషూట్ హంగామా కారణంగా పెళ్లి ముహూర్తం దాటిపోయిందట. ఆ తర్వాతే నిహారిక తన మాజీ భర్త చైతన్యతో తాళి కట్టించుకుందట. అందుకే వీళ్ళ లైఫ్ అలా మధ్యలోనే ముగిసిపోయిందని టాక్.

కానీ వరుణ్ తేజ్ విషయంలో మాత్రం అలాంటి తప్పు జరగకూడదని చిరంజీవి ముందుగానే తన తమ్ముడిని హెచ్చరించారట. అయ్యగారు పెట్టిన ముహూర్తానికి లావణ్య మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాలని.. అది దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుణ్-లావణ్య కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. వారు ఆ సినిమా షూటింగ్ టైంలోనే ప్రేమలో పడిపోయారు.
