షూటింగ్ సమయంలో దర్శకుడిని భయపెట్టిన చిరంజీవి.. పాపం వణికిపోయేవాడుట

- Advertisement -

చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భోళా శంకర్‌’. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన మూవీ టీమ్‌ ‘భోళా శంకర్‌’ గురించి ఆసక్తికరమైన విశేషాలను పంచుకుంది. తమిళంలో ‘వేదాళం’ రీమేక్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ తనను చూస్తే వణికిపోయేవాడని చిరంజీవి చెప్పారు. శీతాకాలంలోనూ చెమటలు పట్టేవని సరదాగా మాట్లాడారు. అసలు ఎందుకు ఇలా అన్నారో ఇప్పుడు చూద్దాం..

చిరంజీవి
చిరంజీవి

దీని గురించి చిరంజీవి మాట్లాడుతూ..‘‘వేదాళం’ సినిమా ఇప్పటి వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయలేదు. ఆ కథకు ఇక్కడి ప్రేక్షకులకు తగినట్లుగా మార్పులు చేసి ‘భోళా శంకర్‌’ను రూపొందించారు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మెహర్‌ రమేశ్‌ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాగే నా సన్నివేశాల చిత్రీకరణ జరిగేటప్పుడు మరింత శ్రద్ధగా ఉండేవాడు. ఆయన నాకు తమ్ముడితో సమానం. నేను సెట్స్‌లోకి అడుగుపెట్టాక పూర్తిగా మారిపోతాను. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాను. ఆ విషయం మెహర్‌కు బాగా తెలుసు. అందుకే నేను సెట్‌లోకి వస్తున్నానంటే వణికిపోయేవాడు. శీతాకాలంలోనూ చెమటలు పట్టాయి’’ అని చిరంజీవి సరదాగా చెప్పారు.

ఇక కీర్తి సురేశ్‌ గురించి మాట్లాడుతూ..‘‘పున్నమినాగు’ సినిమాలో కీర్తి సురేశ్‌ వాళ్ల అమ్మ (మేనక)తో కలిసి నటించాను. ఆ తర్వాత మేము కలిసినప్పుడల్లా తను కీర్తి సురేశ్‌ గురించి చెబుతుండేది. ‘మహానటి’లో కీర్తి నటన చూసి ఆశ్చర్యపోయాను. ఆ సినిమాకు నేషనల్‌ అవార్డు వచ్చినప్పుడు ఎంతో సంతోషించాను. కీర్తి ఇప్పటి వరకు ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించింది. ‘భోళా శంకర్’లో మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. నా చెల్లెలి పాత్రలో కీర్తి అద్భుతంగా నటించింది’’ అని ప్రశంసించారు. అలాగే తమన్నా గురించి చెబుతూ తనను చూస్తే ఎంతో ముచ్చటేస్తుందన్నారు. ‘‘మిల్కీబ్యూటీ’ పాట సమయంలో తమన్నా వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది. కానీ, తమన్నా అక్కడకు వెళ్లకుండా షాట్‌ మధ్యలో ఫోన్‌లో మాట్లాడుతూ వాళ్ల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది. ఎంత బాధ ఉన్నా.. దాన్ని దాచుకుని డ్యాన్స్‌ చేసింది. తనకు సినిమాలంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు’’అని అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here