చిరంజీవి – పవన్ కళ్యాణ్ తో కలిసి నాగబాబు మందు కొట్టేవాడా..! వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

- Advertisement -

మెగా బ్రదర్ గా ,సినీ నిర్మాతగా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా నాగబాబు కి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కేవలం నటుడిగా నిర్మాతగా మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా కూడా సేవలు అందిస్తున్నాడు. ఏమాత్రం భయం బెరుకు లేకుండా మనసులో ఉన్న మాటలను నిర్మొహమాటంగా తెలిపే వ్యక్తిత్వం నాగబాబు సొంతం. అందుకే ఆయన ప్రసంగాలకు మంచి ఆదరణ ఉంటుంది.

చిరంజీవి - పవన్ కళ్యాణ్
చిరంజీవి – పవన్ కళ్యాణ్

అంతే కాదు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలను సైతం లెక్క చెయ్యని తెగువ నాగబాబు సొంతం. అందుకే ఆయన ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ కాలేకపోయినా కూడా మెగా అభిమానులు ఆయనని అభిమానిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి పనుల్లో మంచి బిజీ గా ఉన్నాడు. అయితే గత కొద్దిరోజుల క్రితమే ఆయన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన పంచుకున్న కొన్ని సంఘటనలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Naga Babu

ఆయన మాట్లాడుతూ ‘ ఒకసారి తీవ్రమైన అస్వస్థత రావడం తో కొన్ని చిన్న చిన్న చెడు అలవాట్లను పక్కన పెట్టేసాను.చిన్నప్పటి నుండి నాకు ఒక జీవిని హింసించి, చంపి తినడం అనేది ఇష్టం ఉండేది కాదు.కానీ కొన్ని పరిస్థితుల కారణంగా నాన్ వెజ్ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆపేయాలి అని ఎప్పటి నుండో మైండ్ లో అనుకుంటూ ఉన్నాను, కానీ కుదర్లేదు, అయితే రీసెంట్ గా నేను అస్వస్థత కి గురి అవ్వడం, చెడు అలవాట్లు మానేయాలి అనుకోవడం, దాంతో పాటుగా ఇదే మంచి సమయం అనుకోని నాన్ వెజ్ కూడా మానేసాను అంటూ చెప్పుకొచ్చాడు’.

- Advertisement -
chiranjeevi naga babu pawan kalyan

చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడైనా కూర్చొని మందు కొట్టారా అని అడగగా, దానికి నాగబాబు ‘ఛీ ఛీ అలాంటిది ఏమి లేదు, ఎప్పుడూ కలిసి మందు కొట్టలేదు కానీ, కలిసి భోజనాలు మాత్రం ఇప్పటికీ చేస్తూనే ఉంటాము. అన్నయ్య ఎక్కువ గా మందు తాగడు, ఎప్పుడో ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే తాగుతాడు, కళ్యాణ్ బాబు కూడా అంతే’ అని చెప్పుకొచ్చాడు నాగబాబు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here