Chiranjeevi Surekha : ఈమధ్య కాలం లో చిన్న చిన్న గొడవలకు స్టార్ సెలెబ్రిటీలు విడిపోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో హంగులు, ఆర్భాటాల నడుమ పెళ్లి చేసుకొని, ఏడాది లోపే విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. అలాగే పెళ్లి జరిగి ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిగి, రెండు దశాబ్దాలకు పైగా దాంపత్య జీవితాన్ని కొనసాగించిన దంపతులు కూడా విడాకులు తీసుకొని ఉన్నారు.
కానీ కొన్ని జంటలు మాత్రం దశాబ్దాలు గడిచినా తరగని ప్రేమానుబంధం తో కొనసాగుతూ, ఎన్నో లక్షల మందికి ఆదర్శ దంపతులుగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి , సురేఖ దంపతుల జంట మొదటి స్థానం లో ఉంటుంది. అల్లు రామలింగయ్య చిరంజీవి ని ఎంతో నమ్మి తన కూతురిని ఆయన చేతిలో పెట్టి వెళ్ళాడు. కానీ అల్లు రామలింగయ్య ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు గొప్ప అల్లుడిగా చిరంజీవి నిలిచాడు.
రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇన్నేళ్ల మా ఇద్దరి దాంపత్య జీవితం లో నేను ఒక్కసారి కూడా సురేఖ తో దురుసుగా ప్రవర్తించలేదు. సురేఖ అంత గొప్ప మనిషి. ఈరోజు మా కుటుంబం ఇలా కలిసిమెలిసి ఉంటుందంటే దానికి కారణం సురేఖనే.
ప్రతీ విషయాన్నీ ఎంతో చక్కగా అర్థం చేసుకుంటుంది, ప్రతీ సమస్యని నా దాకా రాకుండా పరిష్కరిస్తుంది. అలాంటి భార్య నాకు దొరకడం, నేను చేసుకున్నఅదృష్టం’ అంటూ చిరంజీవి సురేఖ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. ఇక చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘బింభిసారా’ డైరెక్టర్ వసిష్ఠ తో ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.