Cheeranjivi : మెగాస్టార్ చిరంజీవి.. ఎంతో మందికి ఆయన ఆదర్శం.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగి.. మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. చిరంజీవి చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం చిరంజీవి చాల సినిమాలు లైనప్ చేశారు.

ఇటీవల చిరంజీవి నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో మెగాస్టర్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నేచురల్ స్టార్ నాని చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరూ అనుకుంటూ ఉంటారు. చరణ్ కు, బన్నీకి , తేజ్ కు , వరుణ్ కు మీరు బ్యాగ్రౌండ్ అని కానీ మీరు వాళ్లకు బ్యాగ్రౌండ్ కాదు సార్ ఒక బరువు. మీరు వాళ్లకు ఓ స్ట్రెస్, బాధ్యత .. మీరు నాలాంటి వాడికి బ్యాగ్రౌండ్ అని అన్నారు నాని.

బ్యాగ్రౌండ్ లేని ప్రతివాడికి చిరంజీవిగారు బ్యాగ్రౌండ్ అన్నారు నాని. ఒకప్పుడు గంటల గంటలు మీ సినిమాకోసం సత్యం థియేటర్స్ లో లైన్ లో నిలుచున్నా.. పోలీసుల చేతిలో తన్నులు కూడా తిన్నా అని చెప్పారు నాని. దానికి చిరంజీవి ఎంతాగానో మురిసిపోయారు. నిజంగా నీలా కష్టపడి పైకి వచ్చిన వాళ్లకు నేను దాసోహం అన్నారు చిరు. అలాగే నానిలో నన్ను నేను చేసుకుంటున్నా అని అన్నారు మెగాస్టార్. దాంతో నాని ఆనందంలో తేలిపోయారు.