మెగాస్టార్ చిరంజీవి లో అందరికీ నచ్చే గుణం మంచితనం. తనకి హాని చెయ్యాలని చూసిన వారిని కూడా దగ్గరకి తీసుకునే ఉదార స్వభావం ఉన్న గొప్ప మనస్సు ఆయనది. అందుకు ఎన్నో ఉదాహరణలు చూసాము. ఇక ఆపద లో ఉన్నవారిని ఆదుకోవడం లో కూడా చిరంజీవి కోట్లాది మంది ప్రేక్షకులకు ఒక ఆదర్శం. వీటి అన్నిటితో పాటు చిరంజీవి ఒక్కసారి ఒకరిని నమ్మాడు అంటే చాలా బలంగా నమ్ముతాడు. వాళ్ళు చెప్పేవి గుడ్డిగా ఫాలో అవుతాడు. ఇదే ఆయన కొంప ముంచుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన ‘భోళా శంకర్’ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అదుముకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉండొచ్చు కానీ, ఈ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని మాత్రం మళ్ళీ చూడలేం. ఇలాంటి సినిమాలను చిరంజీవి చెయ్యడానికి ఒక డైరెక్టర్ కారణం అని అంటున్నారు.

అతను మరెవరో కాదు వీవీ వినాయక్. ఈయన మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా మంచి స్నేహితుడు. అయితే ఈయన గత కొంత కాలం గా చిరంజీవి తోనే కలిసి ఉంటున్నాడు. చిరంజీవి ఒక కొత్త సినిమా ఒప్పుకోవాలంటే వీవీ వినాయక్ అప్రూవల్ కూడా కచ్చితంగా ఉండాల్సిందేనట. కథ చర్చల్లో కచ్చితంగా వీవీ వినాయక్ కూడా కూర్చుంటాడట. అయితే రీసెంట్ గా విడుదలైన ‘భోళా శంకర్’ సినిమాని చెయ్యమని సజ్జస్ట్ చేసింది కూడా వీవీ వినాయక్ అట.
మెహర్ రమేష్ కి మీరు కచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్నయ్య అని చిరంజీవితో పట్టుబట్టి ఈ ‘భోళా శంకర్ ‘ చేయించాడు. ఫలితం అందరికీ తెలిసిందే, చిరంజీవి గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కి మొదటి రోజు 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది. కానీ ‘భోళా శంకర్’ కి ఫుల్ రన్ లో కూడా అంత మొత్తం రాలేదు. ఇంత పెద్ద ఫ్లాప్ కి కారణం వీవీ వినాయక్ అని , ఇతనిని వెంటనే పక్కన పెట్టండి అంటూ చిరంజీవిని సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్నారు ఫ్యాన్స్.
