Charmy Kaur : మాస్ మహారాజ రవితేజ ఇండస్ట్రీ లో ఉన్న అందరితో చాలా సరదాగా ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. హీరోలు, హీరోయిన్లతో పాటు క్యారక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ తో కూడా ఆయనకీ మంచి స్నేహం ఉంది. అలాంటి రవితేజ తో హీరోయిన్ ఛార్మీ లేటెస్ట్ గా గొడవపడినట్టు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’, అలాగే పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’, ఈ రెండు సినిమాలు కూడా ఆగష్టు 15 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఛార్మీ నేడు రవితేజ తో, నిర్మాతతో ప్రత్యేకంగా భేటీ అయ్యి, థియేటర్స్ సర్దుబాటు పై చర్చలు జరిపింది.
ఎందుకంటే డబుల్ ఇస్మార్ట్ మూవీ కి పూరి జగన్నాథ్ తో పాటుగా ఈమె కూడా నిర్మాతగా వ్యవహరించింది కాబట్టి. అయితే ఈ చర్చలు విఫలం అయ్యినట్టు తెలుస్తుంది. ముందుగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని ఒక రోజు ముందుగా విడుదల చెయ్యాలని కోరింది ఛార్మీ. అందుకు నిర్మాత విశ్వప్రసాద్ ఒప్పుకోలేదు, ఆ తర్వాత కనీసం థియేటర్స్ సర్దుబాటు అయినా చెయ్యాలని, తమకి కొన్ని మంచి థియేటర్స్ ఇవ్వాలని ఆమె పట్టుబట్టిందట.
కానీ నిర్మాత అందుకు కూడా ఒప్పుకోలేదు అని తెలుస్తుంది. ఒకానొక సమయం లో ఆమె నిర్మాతతో, రవితేజ తో దురుసుగా కూడా మాట్లాడింది అట. రవితేజ కి ఛార్మీ మొదటి నుండి మంచి సన్నిహితురాలే. వీళ్లిద్దరు కలిసి గతం లో చంటి అనే సినిమా చేసారు. కానీ వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు సినిమాల విడుదల పట్ల విబేధాలు ఏర్పడడం గమనార్హం. మరో విశేషం ఏమిటంటే నేడు సోషల్ మీడియా లో ఛార్మీ హీరో రవితేజ ని, డైరెక్టర్ హరీష్ శంకర్ ని ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా అన్నీ యాప్స్ లో కూడా అన్ ఫాలో కొట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిన అంశం. మరి వీళ్లిద్దరి మధ్య గొడవ సర్దుమణుగుతుందా లేదా పెద్దది అవుతుందా అనేది చూడాలి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.