ChandraMohan : టాలీవుడ్ గోల్డెన్ ఎరా లో మిగిలిన ఒకే ఒక్క సీనియర్ నటుడు చంద్ర మోహన్ నేడు కన్ను మూయడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. హీరో గా 175 సినిమాలకు పైగా నటించి అప్పట్లో టాప్ మోస్ట్ స్టార్ హీరోలలో ఒకడిగా ఇండస్ట్రీ చరిత్ర సృష్టించాడు. అంతే కాదు అప్పట్లో ఈయన పక్కన హీరోయిన్ గా చేస్తే వాళ్ళ జాతకాలు మారిపోతాయి అనేవాళ్ళు. శ్రీదేవి మొదటి సినిమా ఇతనితోనే చేసింది.

అలా హీరో గా గొప్పగా రాణించిన చంద్రమోహన్, క్యారక్టర్ ఆర్టిస్టుగా అంతకు మించి గొప్పగా రాణించాడు. ముఖ్యంగా తండ్రి పాత్ర అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది చంద్ర మోహనే. ఆయనని చూస్తూనే మన తండ్రిని చూసుకున్నట్టే అనిపిస్తుంది. అయితే చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న చంద్ర మోహన్ నేడు మన అందరినీ వదిలి తిరిగి రాని లోకాలకు పయనం అవ్వడం అభిమానులను తీవ్రమైన మనస్తాపానికి గురి చేస్తుంది.

ఇదంతా పక్కన పెడితే చంద్ర మోహన్ చనిపోయే ముందు కొద్దిరోజుల క్రితం ఒక అవార్డు ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నా తరం లో నాతో పాటు ఇండస్ట్రీ కి వచ్చిన నటులందరూ స్వర్గస్తులు అయ్యారు. కృష్ణం రాజు గారు, కృష్ణ గారు చనిపోవడం నా మనసుకి ఎంతో బాధని కలిగించింది. కృష్ణ గారు నేను ఒకే సమయం లో కెరీర్ ని ప్రారంభించాము. మగవాళ్ళు అందరూ పోయారు కానీ, ఆడవాళ్లు ఇంకా ఆరోగ్యం గానే ఉన్నారు. వాణిశ్రీ, శారదా ఇలా చాలా మంది ఇంకా ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా మిగిలి ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఆయన చెప్పిన కొద్దీ నెలలకే తుది శ్వాసని విడిచిపెట్టడం ఆయన్ని అభిమానించే వారికి ఎంతో బాధని కలుగచేస్తుంది. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని ఆశిద్దాం.