Chandrabose సాహిత్య కళాకారుడిగా డిగ్గి స్థాయికి చేరిన వారిలో ఒకరు చంద్రబోస్. ఎన్నో మేలిమి ముత్యాలు లాంటి పాటలు రాసి , తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిల్చిపోయారు. ఇండస్ట్రీ కి జియా రచయితలూ వస్తున్నారు, పోతున్నారు. కానీ చంద్రబోస్ మాత్రం గత మూడు దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నారు. ఆయన పనిచేయని సినిమా అంటూ ఏది లేదు. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలో చంద్రబోస్ రాసే పాట కచ్చితంగా ఉండాల్సిందే. ఆయన ప్రతిభ ప్రపంచ స్థాయికి ఎగబాకి, ఆస్కార్ అవార్డుని సైతం గెలుచుకునేలా చేసింది అంతే, ఆయన ఎంత గొప్ప సాహిత్య కళాకారుడో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం చంద్రబోస్ కి ఉన్నంత డిమాండ్ ఇండియా లో ఏ లిరిసిస్ట్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్న సినిమాల నుండి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల మేకర్స్ వరకు ప్రతీ ఒక్కరు చంద్రబోస్ బ్రాండ్ ఇమేజి ని ఉపయోగించుకోవాలని తహతహలాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే చంద్రబోస్ సతీమణి సుచిత్ర చంద్రబోస్ కూడా ఒక కళాకారిణి అనే విషయం మీకెవరికైనా తెలుసా?. ఈమె నృత్య కళలో ప్రసిద్ధి గాంచింది. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేసింది.
అందులో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ డ్యాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో, ఆయన వేసే స్టెప్పులు ఎంత కష్టతరమైనవో మన అందరికీ తెలిసిందే. అలాంటి అల్లు అర్జున్ పాటలకు కూడా ఆమె డ్యాన్స్ మాస్టర్ గా పని చేసిందంటే ఆమె టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలా ఇండస్ట్రీ కి సంబంధించిన ఇద్దరు ముఖ్యమైన కళాకారులు భార్యభర్తలు అవ్వడం చాలా అరుదైన కలయిక. భవిష్యత్తులో వీళ్లిద్దరు ఇంకా ఏ స్థాయికి చేరుకుంటారో చూడాలి. ప్రస్తుతం చంద్రబోస్ చేతిలో అరడజను తెలుగు సినిమాలు, నాలుగు హిందీ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరో ఆరు పాన్ ఇండియన్ చిత్రాలకు పాటలు రాయడానికి చర్చలు జరుపుతూ ఉన్నారు. అలా ఇండస్ట్రీ ఎంతమంది రచయితలూ వచ్చిన చంద్రబోస్ డిమాండ్ ఇసుమంత కూడా తగ్గదు అనడానికి ఇదొక నిదర్శనం గా చెప్పుకోవచ్చు.