Chandra Mohan : తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో మేలిమి బంగారం లాంటి మహానటుడు చంద్ర మోహన్ ని కోల్పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. మూడు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన చంద్రమోహన్ అంత్యక్రియలు నిన్ననే పూర్తి అయ్యింది. ఇండస్ట్రీ లో చంద్ర మోహన్ దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించాడు. ప్రతీ ఒక్కరితో ఆయనకీ మంచి రిలేషన్ కచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే అలాంటి లెజెండ్ చనిపోయిన తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు ముందుకు రాలేదు అని చెప్పడానికి చాలా బాధగా ఉంది. చంద్ర మోహన్ లాంటి నటుడికి ఇది దక్కాల్సిన గౌరవం కాదు. బ్రహ్మానందం,సాయి కుమార్, జయసుధ ఇలా కొంతమంది సెలబ్రిటీస్ మినహా, మిగతా వాళ్ళు ఎవరూ కూడా చంద్రమోహన్ ని చివరి చూపు చూసుకునేందుకు రాలేదు.

ప్రతీ చావుకు వచ్చే మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి మోహన్ బాబు, వెంకటేష్ , నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు ప్రభాస్ ఇలా ఒక్కరు కూడా చంద్రమోహన్ భౌతిక కాయాన్ని సందర్శించలేదు. అలాంటి లెజెండ్ ని మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం రాదు,చివరి చూసే అవకాశాన్ని ఆయనతో అనుబంధం ఉన్న ఏ హీరో కూడా వదులుకోరు. కానీ రాకపోవడానికి కారణం దీపావళి అవ్వడమే.

పండుగ రోజు చనిపోయిన వారి ఇంటి గుమ్మాన్ని తొక్కడం సరికాదని, అరిష్టం అంటుకుంటుంది అనే భయం తోనే చంద్ర మోహన్ భౌతిక కాయాన్ని ఎవ్వరూ చూడలేదని అంటున్నారు. కానీ సోషల్ మీడియా ద్వారా అందరూ సెలెబ్రిటీలు చంద్ర మోహన్ మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. అంత వరకు బాగానే ఉంది కానీ , ఇన్నేళ్లు కలిసి పనిచేసిన నటుడు చనిపోతే చూసేందుకు ఒక్కరు కూడా ముందు రాని విషయాన్నీ ఆడియన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు.
