Chandra Mohan : కష్టపడి సంపాదించిన ఆస్తిని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా దాచుకోవాలి అనేది ఇండస్ట్రీ శోభన్ బాబు తర్వాత చంద్ర మోహన్ ని చూసి నేర్చుకోవాలి అని కొంతమంది అంటూ ఉంటారు. అది నిజమే అని పలు ఉదాహరణలు చూసినప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. శోభన్ బాబు లాగానే చంద్ర మోహన్ కూడా తానూ సంపాదించిన డబ్బులను ఎక్కువగా భూములను కొనుగోలు చెయ్యడానికి ఉపయోగించేవాడట. అలా హైదరాబాద్ లో ఆస్తులను బాగానే ఏర్పాటు చేసుకున్నాడు.

అప్పట్లో కొంతమంది కబ్జా దారులకు భయపడి శంషాబాద్ వంటి ప్రాంతాల్లో భూములను అమ్మేసుకున్నాడు కానీ, అవి ఈరోజు ఉంది ఉంటే చంద్ర మోహన్ ఆస్తులు ఇంకా ఎక్కువ ఉండేవి. 2017 వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన చంద్ర మోహన్, 2017 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది ఇలా ఉండగా చంద్రమోహన్ చనిపోయిన తర్వాత తన ఆస్తులు ఎవరికీ చెందాలి అనే దానిపై రాసిన ఒక వీలునామా ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

చంద్ర మోహన్ తానూ సినీ కెరీర్ ద్వారా సంపాదించిన ఆస్తుల విలువ మొత్తం 300 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఆస్తులు మొత్తం తన కూతుర్లకు చెందాలి అంటూ ఆయన వీలునామా లో రాసాడట. అలాగే చంద్ర మోహన్ కి కొడుకు లేడు. చనిపోయిన తర్వాత కొడుకు తలకొరివి పెట్టడం అనేది ఆనవాయితీ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

చంద్ర మోహన్ కి కొడుకు లేడు కాబట్టి, తనకి తలకొరివి పెట్టినవాడికి తన ఆస్తిలో 20 శాతం వాటా చెందుతుంది అని వీలునామా లో రాసాడట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన రాసిన వీలు నామలో ఉన్నటువంటి 300 కోట్ల విలువ మొత్తం భూములకు సంబంధించినదే అట. భూములు కాకుండా ఆయన బ్యాంక్ సేవింగ్స్ కూడా ఒక రేంజ్ లో చేసాడని సమాచారం.