రష్మిక స్టార్ గా ఎదగడానికి శ్రీలీల ఇంత కష్టపడిందా..

- Advertisement -

నటి శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు వంటి అగ్ర హీరోలతోనూ కలిసి నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అప్పట్లో నాగశౌర్య హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛలో’ను శ్రీలీల మిస్‌ చేసుకుందట. ‘ఛలో’లో శ్రీలీల కథానాయికగా నటించాల్సి ఉందని నాగశౌర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రష్మిక
రష్మిక

అవును.. మొదట శ్రీలీల.. నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉందట. కానీ, కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. ఈ విషయాన్ని హీరో నాగశౌర్యనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం రంగబలి. జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన శౌర్య.. ఈ విషయాన్ని రివీల్ చేశాడు. మొదట ఛలో సినిమాకు శ్రీలీలను అనుకున్నామని, అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆమె నటించలేకపోవడంతో రష్మిక మందన్న ఆ అవకాశాన్ని అందుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

Rashmika sreeleela

ఇక రష్మిక ఈ సినిమాతో ఎంత మంచి సక్సెస్ ను అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే రష్మిక టాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. ఛలో సక్సెస్ తరువాతనే గీతగోవిందం ఓకే చేసింది. వరుసగా ఈ రెండు సినిమాలు హిట్ అందుకోవడంతో నేషనల్ క్రష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకవేళ ఛలో సినిమాలో శ్రీలీలనే నటించి ఉంటే రష్మిక.. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉండేదో చెప్పలేం. గీతగోవిందంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేదో.. లేక మరేదైనా సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యేదో.. ఏదిఏమైనా శ్రీలీల హిట్ సినిమాను వదులుకొని తప్పు చేసినా.. ఇప్పుడు మాత్రం అలాంటి తప్పు చేయకుండా స్టార్ హీరోలందిరితోనూ నటించి మెప్పిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here