Pavitranath : మొగలి రేకులు సీరియల్‌ ఫేమ్‌ దయ మృతి.. క్లారిటీ ఇచ్చిన ఆమె..

Pavitranath : చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌లో ఇంద్రనీల్‌కి తమ్ముడిగా నటించిన దయా అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నిన్న సాయంత్రం పవిత్రనాథ్‌ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పటికి ఆయనకు ఏమీ కాలేదని, ఇదంతా అవాస్తవం అని సోషల్‌ మీడియాలో మళ్లీ వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే.. ఇవాళ ఉదయం పవిత్రనాథ్‌ చనిపోయినట్లు ఇంద్రనీల్ భార్య మేఘన ఇస్టాలో పోస్ట్‌ చేశారు. దీంతో పవిత్రనాథ్‌ చనిపోయినట్లు ఈ పోస్ట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

‘‘పవీ.. ఈ బాధను వర్ణించలేం.. మా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తివి నువ్వే.. ఈ వార్త విన్న తర్వాత.. ఇది నిజం కాకూడదని నేను కోరుకున్నాను. ఇది అబద్ధం అని నేను ఆశిస్తున్నాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.. కనీసం నిన్ను చివరిసారిగా చూడలేకపోయాం.. వీడ్కోలు కూడా చెప్పలేకపోయాం.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. మే మీ ఆత్మకు శాంతి కలగాలని.. దేవుడు మీ కుటుంబానికి మరింత మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా” అని ఇంద్రనీల్ భార్య మేఘన ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Pavitranath

మేఘన, ఇంద్రనీల్ పోస్ట్‌పై నెటిజన్లు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలేం జరిగింది?.. కరుణ చనిపోవడం ఏంటి?.. ఇదంతా ఎప్పుడు జరిగిందో.. ఎందుకో ఎవరికీ తెలియడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కోరుకుంటున్నారు. గతంలో పవిత్రనాథ్ పై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. అతనికి అమ్మాయిలంటే పిచ్చి అని.. తనకంటే ముందే వాళ్లను ఇంటికి తీసుకొచ్చేవాడని.. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కొట్టేవాడని అప్పట్లో ఆమె ఆరోపణలు సంచలనం రేపినవిషయం తెలిసిందే. ఇప్పుడు దయా అలియాస్ పవిత్రనాథ్ చనిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది నిజమేనా? అంటూ రెస్ట్‌ ఆఫ్‌ పీస్‌ అంటూ పోస్ట్‌ చేస్తున్నారు.