Chaitanya : జొన్నలగడ్డ వెంకట చైతన్య గురించి పరిచయం చేయక్కర్లేదు. మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా గుర్తింపుని తెచ్చుకున్నాడు సోషల్ మీడియాలో కూడా అనేక సార్లు వైరల్ అయ్యాడు. పైగా ఎన్నోసార్లు నిహారిక కారణంగా వార్తల్లో నిలిచాడు. జొన్నలగడ్డ వెంకట చైతన్య నిహారిక పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడిపోయారు. విడాకులు తీసుకున్నటువంటి వీళ్లిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉంటున్నారు. ఇక నిహారిక అయితే ప్రస్తుతం కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్లలో భాగంగా తన పెళ్లి విడాకులు అలానే రెండో పెళ్లి గురించి కామెంట్స్ చేసిన విషయం మనకి తెలుసు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో జొన్నలగడ్డ చైతన్య మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈమె కామెంట్స్ చేయడంతో ఇలా పోస్ట్ చేసాడు. పరోక్షంగా నిహారిక ని ఉద్దేశించి తనకి కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్ట్లు చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా రాసుకు వస్తున్నాను. ఇన్స్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం అయిన పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నానని పోస్ట్ చేయడంతో నెటిజెన్స్ కచ్చితంగా ఇది నిహారికనే ఉద్దేశించి చేశారని కామెంట్లు చూస్తున్నారు. వీళ్ళిద్దరూ విడిపోయి సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్టులు పెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.