Niharika : రెండేళ్ల క్రితం మెగా బ్రదర్ నాగబాబు తన గారాల పట్టి నిహారిక కి చైతన్య అనే కుర్రాడితో అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని ఒక ప్యాలస్ లో వివాహం జరిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. స్టార్ సెలెబ్రిటీలు ఈ స్థాయిలో ఘనంగా వివాహం చేసుకోవడం ఇటీవల కాలం లో మనం చూడలేదు. అంత గ్రాండ్ గా వివాహం చేసుకున్న ఈ జంట కొంతకాలం సంతోషం గానే దాంపత్య జీవితం గడిపారు.
కానీ ఆ తర్వాత ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా ఈ జంట విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు విడిపోవడం మెగా అభిమానులకు తీవ్రమైన శోకాన్ని మిగిలించింది అనే చెప్పాలి. అయితే నిహారిక రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియా లో అనేక రూమర్స్ వచ్చాయి, అయితే అవి కేవలం రూమర్స్ గానే మిగిలాయి. ప్రస్తుతం ఆమె ఇలాంటి రూమర్స్ కి దూరం గా కేవలం తన సినీ కెరీర్ మీదనే ఫోకస్ పెట్టింది.
కానీ నిహారిక మాజీ భర్త చైతన్య మాత్రం రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడట. ఆ రెండవ పెళ్లి చేసుకోబోయేది నిహరాకి ప్రాణ స్నేహితురాలినే అని సోషల్ మీడియా లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. నిహారిక తో వైవాహిక బంధం లో ఉన్నప్పుడే ఆమె స్నేహితురాలితో కూడా చాలా క్లోజ్ గా ఉండేవాడట చైతన్య. అంతే వీళ్లిద్దరి పెళ్ళికి కూడా ఆమె హాజరు అయ్యింది.
సంగీత్ లో ఈ జంటతో కలిసి డ్యాన్స్ కూడా వేసింది. అలాంటి ఆమె ఇప్పుడు చైతన్య ని పెళ్లి చేసుకోబోతుండడం అందరినీ పెద్ద షాక్ కి గురి చేస్తుంది. ఆమె ఒక ప్రముఖ బిజినెస్ మెన్ కూతురు అట. సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నప్పటికీ ఆమెతో మెగా ఫ్యామిలీ కి మంచి రిలేషన్ ఉందట. ఏదైనా తన స్నేహితురాలు తన మాజీ భర్తని పెళ్లి చేసుకోబోతుండడం మాత్రం నిహారిక కి పెద్ద షాక్ అనే చెప్పాలి.