Getup Srinu : ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలుగా పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్ అచంట, సుడిగాలి సుధీర్, ఆటో రామ్‌ప్రసాద్, గెటప్ శ్రీను ఇలా ఎంతోమంది ఉన్నారు. జబర్ధస్త్ లోకి రాకముందు కనీసం తినడానికి తిండి లేని స్థాయి నుంచి నేడు హైదరాబాద్‌లో సొంత ఇల్లు, కార్లు సంపాదించే లెవల్ కు వారు ఎదిగారు. గెటప్ శ్రీను జబర్దస్త్ స్టార్ కమెడియన్‌లలో ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా తన కామెడీతో పండించే గెటప్ శ్రీను. ఎన్నో రకాల గెటప్స్ వేసి జనాలను ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ వేదికపై గెటప్ శ్రీను వేసిన కొన్ని వేషాలు ఇప్పటికీ జనాలకు గుర్తుండిపోతాయి. ఇక శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ముగ్గురు కలిశారంటే స్కిట్ హిట్ కొట్టి తీరాల్సిందే.
గెటప్ శ్రీను జబర్దస్త్ మానేసి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం నటుడిగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా.. ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హనుమాన్ లో ఓ కీలక పాత్రలో నటించాడు. రాజు యాదవ్ టైటిల్ తో హీరోగా మూవీ చేశాడు. అది త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానంది. సిల్వర్ స్క్రీన్ మీద కూడా స్టార్ కామెడియన్ గా పాపులారిటీ దక్కించుకున్న గెటప్ శ్రీను.. ఇటీవల తన ఆస్తులపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ వల్ల సెటిల్ అయిన మాట వాస్తవమే కానీ.. కోట్ల రూపాయలు సంపాదించానన్న మాట మాత్రం అబద్ధం. ఇల్లు ఉంది కానీ దానికి ఈఎంఐ కట్టాలి.
అలాగే కారు కొనుక్కున్నాడు. దానికి కూడా ఈఎంఐ కట్టాలి. అలాగే నేను పెద్ద బంగ్లాలు, బిఎండబ్ల్యూ కార్లు కోరుకోను.. ఉన్నంతలో చాలా సంతోషంగా ఉంటున్నాం అంటూ వివరించాడు. పెద్దపెద్ద కమిట్మెంట్స్ పెట్టుకుంటే నిద్ర ఉండదు. అంతకంటే దరిద్రం మరోటి ఉండదు. ఉదయాన్నే ప్రశాంతంగా లేచే జీవితం నాకు ఉండాలి. డబ్బు ఒత్తిడి ఉంటే ఏ సినిమా పడితే అది చేయాల్సి వస్తుంది. అప్పుడు క్రియేటివిటీ దెబ్బతినే అవకాశం ఉంది. ఒత్తిడి లేకపోతే సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ నా వరకు నేను హ్యాపీగా ఉండగలను. వర్క్ సైడ్ డిస్టర్బ్ కాకూడదు అని.. నేను అనుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జబర్దస్త్ మానేసినప్పటికీ షోను మిస్ అవకుండా చూస్తాను. రామ్‌ప్రసాద్, సుడిగాలి సుధీర్‌ను తరచూ కలుస్తూనే ఉంటాను. వాళ్ళని ఎప్పుడూ మిస్ అవ్వనంటూ చెప్పుకొచ్చాడు.