Caption VIjaykanth : తమిళనాడు లో యాక్షన్ హీరో గా ఎన్నో వందల సినిమాల్లో నటించి, టాప్ 3 తమిళ స్టార్ హీరోలలో ఒకడిగా విజయ్ కాంత్ కి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో మన అందరికీ తెలిసిందే. అభిమానులు ప్రేమగా ఈయనని ‘కెప్టెన్’ అని పిలుస్తూ ఉంటారు. సినిమాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విజయ్ కాంత్, ఆ తర్వాత ప్రజాసేవ కోసం డీఎండీకే పార్టీ స్థాపించి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఈయన పార్టీ స్థాపించి మొదటి సారి పోటీ చేసినప్పుడు మిశ్రమ ఫలితమే వచ్చింది. కానీ ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆయన ఆ పార్టీ ని చివరి శ్వాస వరకు కొనసాగించాడు. ప్రతిపక్ష నేతగా ఎన్నో సేవలు అందించాడు. అలాంటి గొప్ప మనిషి అనారోగ్యం తో కన్ను మొయ్యడం యావత్తు తమిళనాడు ప్రజల్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.
గత కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతున్న విజయ్ కాంత్, రీసెంట్ గానే చికిత్స తీసుకొని కోలుకున్నాడు. కానీ మళ్ళీ కరోనా సోకడం తో ఆరోగ్యం బాగా క్షీణించింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి చికిత్స పొందుతుండగా తన తుది శ్వాసని విడిచిపెట్టాడు. ఇదంతా పక్కన పెడితే ఆయనకీ సంబంధించిన ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే విజయ్ కాంత్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడే అట.
ఆయన పూర్వికులు ఆంధ్ర ప్రదేశ్ లో ఉండేవారని, బ్రిటిష్ కాలం లో వాళ్ళు చెన్నై కి వలస వచ్చేశారని విజయ్ కాంత్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అంతే కాదు విజయ్ కాంత్ కి టాలీవుడ్ హీరోలతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. మెగాస్టార్ చిరంజీవి విజయ్ కాంత్ కి బాగా తెలుసట. విజయ్ కాంత్ హీరో గా నటించిన ‘రమణ’ చిత్రాన్ని చిరంజీవి ఇక్కడ ‘ఠాగూర్’ పేరుతో రీమేక్ చేసాడు. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.