Child Artist : ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత తెలుగు తమిళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పర్చుకుంది. స్వతహాగా కెరీర్ పరంగా ఈమెకి సినిమాలతో అసలు సంబంధమే లేదు.

ఒక కిక్ బాక్సింగ్ ప్లేయర్ గా మాత్రమే ఈమె అప్పట్లో కెరీర్ ని మొదలు పెట్టింది. కానీ ఆమె అందం ని చూసి మేకర్స్ ఆమెకి సినిమా అవకాశాలు ఇచ్చారు. అలా సినిమాల్లో బిజీ గా అవ్వడం తో తన కిక్ బాక్సింగ్ కెరీర్ ని వదిలి పెట్టింది. ఇప్పుడు ఆమె ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఒక పవర్ ఫుల్ రోల్ ని పోషించే రేంజ్ కి ఎదిగింది. ఆమె మరెవరో కాదు, రితిక సింగ్.

హిందీ లో ఈమె మాధవన్ హీరో గా నటించిన ‘సాలా కదూస్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఇదే సినిమాని తెలుగు లో ‘గురు’ పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన రితిక సింగ్ కి తెలుగులో కంటే కూడా ఎక్కువగా తమిళం లో అవకాశాలు దక్కాయి. పలు సూపర్ హిట్ సినిమాలు కూడా ఆమె ఖాతాలో పడింది కానీ, అనుకున్న రేంజ్ స్థాయికి మాత్రం చేరుకోలేకపోయింది.

ఇప్పుడు ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ లో ఒక పవర్ ఫుల్ రోల్ ని చేస్తుంది. ఈ రోల్ కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని సమాచారం. రీసెంట్ గానే ఒక భారీ యాక్షన్ సన్నివేశం ని రిస్క్ తీసుకొని చేసి చేతులు కాళ్లకు దెబ్బలు తగిలించుకుంది. కనీసం ఈ సినిమా తో అయినా రితిక సింగ్ అనుకున్న రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి.
