Guess Who : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘దేశముదురు’ బ్యూటీ.. అసలేమైంది

- Advertisement -

Guess Who : చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‎గా ఓ వెలుగు వెలుగుతోంది. బాలనటిగా రస్నా యాడ్ లో నటించి రస్నా బేబీ అనిపించుకుంది. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా అనేక చిత్రాల్లో నటించి అలరించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తుంది. ఓ వైపు సినిమాలు.. మరో వైపు వెబ్ సిరీసులు చేసుకుంటూ బిజీగా ఉంది. వాటితో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది. ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ హీరోయిన్‏గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పూర్తిగా ఢీగ్లామర్ లుక్‏లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా ?

 

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించిన హాన్సిక.. ఇప్పుడు గాంధారి సినిమాతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించనుంది. ఈ మూవీలో హాన్సిక డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో మసాలా పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జయం కొండాన్, కండెన్ కాదలై, సేటై వంటి సినిమాలను తెరకెక్కించారు ఆర్.కన్నన్. ఇప్పుడు గాంధారి అనే హార్రర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

ఇందులో హాన్సిక కీలక పాత్రలో నటిస్తుంది. హార్రర్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో పురావస్తు శాఖ అధికారిగా హాన్సిక కనిపించనుంది. చెన్నై సముద్ర తీరంలో దాదాపు రూ.60 లక్షల వ్యయంతో పెద్ద కొండ ఇంటి సెట్ వేసి అందులో 1943 నాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ఆడుగళం నరేశ్ పలువురు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here