Swetha Agarwal : ప్రభాస్ ‘రాఘవేంద్ర’ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇంత హాట్ గా తయారయ్యిందేంటి..?

- Advertisement -

Swetha Agarwal : కొంతమంది హీరోయిన్లు గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉండడాన్ని మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించిన హీరోయిన్లు, ఇప్పుడు చిన్న వయస్సులోనే ఆంటీలు లాగ తయారై దర్శనమిస్తున్నారు. అలాగే ఒకప్పుడు యావరేజి గా అనిపించిన హీరోయిన్లు ఇప్పుడు అద్భుతమైన ఫిజిక్ తో కనిపిస్తూ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. అలాంటి హీరోయిన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘రాఘవేంద్ర’ చిత్రం గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. తొలి సినిమా ‘ఈశ్వర్’ తో సూపర్ హిట్ ని అందుకున్న ప్రభాస్ కి రెండవ సినిమా ‘రాఘవేంద్ర’ ఫ్లాప్ తో గట్టి షాక్ తగిలింది.

swetha agarwal
swetha agarwal

కమర్షియల్ గా ఈ చిత్రం ఆరోజుల్లో అంత పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్వేతా అగర్వాల్ నటించింది. ఈ సినిమా హిట్ అయ్యుంటే తెలుగు లో ఆమె రేంజ్ బాగా పెరిగేది, వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండేది. కానీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఈమెకి మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. ఈ చిత్రానికి ముందు ఆమె అల్లరి నరేష్ మొదటి చిత్రం అల్లరి లో కూడా నటించింది. అయితే కావాల్సిన రేంజ్ లో గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా కన్నడ లో ఈమెకి సుదీప్ ‘కిచ్చా’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Raghavendra (2021) Telugu Movie: Watch Full HD Movie Online On JioCinema

- Advertisement -

ఆ తర్వాత పలు కన్నడ సినిమాల్లో నటించిన ఈమెకి హిందీ లో కూడా అవకాశాలు బాగానే దక్కాయి. కానీ ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా శ్వేతా అగర్వాల్ కి నటిగా అనుకున్న స్థాయి గుర్తింపు రాలేదు. 2010 వ సంవత్సరం వరకు సినిమాల్లో కొనసాగిన ఆమె, ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ్ ని ప్రేమించి పెళ్లాడింది. సినిమాలకు, టీవీ షోస్ కి దూరం గా ఉన్నప్పటికీ కూడా, ఈమె సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టీవ్ ఉంది.

Swetha Agarwal Photos
Swetha Agarwal Photos

తనకి, తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ అభిమానులకు బాగా దగ్గరగా ఉంది. రీసెంట్ గా ఆమె దిగిన కొన్ని ఫోటోలను చూసి అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. 38 ఏళ్ళ వయస్సు ఉన్న ఈమె నేటి తరం యంగ్ హీరోయిన్స్ కి పోటీ పడే స్థాయిలో తయారైంది. ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ని మీరు కూడా చూసేయండి.

 

Aditya Narayan's wife Shweta Agarwal makes her Instagram account public, shares mushy wedding pic – India TV

Aditya Narayan, wife Shweta Agarwal are soaking in the sun in Maldives, see vacation photos | Television News - The Indian Express

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here