Ajay Ghosh : నన్ను ఫోన్ చేసి తిట్టండి.. నా నంబర్ కూడా ఇదే.. అజయ్ ఘోష్.. ఇంతకి ఏమైంది ?

- Advertisement -

Ajay Ghosh : టాలీవుడ్ నటుడు అజయ్ గోష్, హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. జూన్ 14వ తేదీన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. శివ పాలడుగు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, పాటలు, పోస్టర్లు విడుదల అయ్యి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది.

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని.. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చిన్న పెద్ద అందరూ కలిసి వచ్చి చూడండి. నచ్చకపోతే నన్ను ఫోన్ చేసి మరీ బూతులు తిట్టొచ్చంటూ మాట్లాడుతూనే తన నంబర్ కూడా చెప్పేశాడు. దీంతో మ్యూజిక్ షాపు మూర్తి సినిమా పై అజయ్ గోష్ ఎలాంటి అంచనాలు పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

ఇక ఈ సినిమాలోని ప్రధాన పాత్రలో అజయ్ గోష్‌ నటించడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్‌లో విభిన్నమైన క్యారెక్టర్లలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అజయ్ గోష్.. పాతికేళ్ల వయసులో సాధించలేని సక్సెస్ 50 ఏళ్లు తర్వాత సాధించాలని భావించే ఓ వ్యక్తిగా క‌నిపించాడు. దానికోసం ఆయన చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి.. ఎంత ఎమోషనల్ గా సాగింది. ప్రేక్షకులకు చెప్పే కథే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ డైరెక్టర్ శివ పాలడుగు చెప్పుకొచ్చాడు. కాగా అజయ్ ఘోష్ తన మొబైల్ నంబర్ ఇచ్చి మరీ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సినిమా నచ్చకపోతే నాకు ఫోన్ చేసి తిట్టమని అనడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here