సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రాబొయ్యే రోజుల్లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చినా, ఆయన రేంజ్ పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ కి వెళ్లినా, ఆయన కెరీర్ లో కొన్ని ఆణిముత్యాలు లాంటి సినిమాలను ఎప్పటికీ మనం మరచిపోలేము. మహేష్ బాబు కి ఉన్నటువంటి అద్భుతమైన ఫిల్మోగ్రఫీ టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా లేదు అని అందరూ అంటూ ఉంటారు. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి.
ముఖ్యంగా పూరి జగన్నాథ్ తో ఆయన చేసిన రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీ ని షేక్ చెయ్యడమే కాకుండా , ఆల్ టైం క్లాసిక్స్ గా కూడా నిల్చింది. ముఖ్యంగా ‘బిజినెస్ మ్యాన్’ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఈ చిత్రం తో మహేష్ బాబు తొలిసారి పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని పోషించాడు.
దూకుడు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు పూరి జగన్నాథ్ తో చేసిన సినిమా ఇది. దూకుడు అలా థియేటర్స్ లో వంద రోజులు ఆడి వెళ్ళగానే ఈ చిత్రం విడుదలైంది. 2012 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆరోజుల్లోనే సుమారుగా 41 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి ఆల్ టైం టాప్ 3 చిత్రం గా నిల్చింది. అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇప్పుడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా, ఓవర్సీస్ లో కూడా ప్రారంభించారు. కేవలం హైదరాబాద్ సిటీ నుండే ఈ సినిమాకి అప్పుడే 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ చిత్రం కచ్చితంగా ఖుషి మొదటి రోజు వసూళ్లు (4 కోట్ల 20 లక్షల) గ్రాస్ ని అధిగమించే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.