Anu Emmanuel : ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న బన్నీ హీరోయిన్.. పెళ్లికి రెడీ అట

- Advertisement -


Anu Emmanuel : అను ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అందంతో.. నటనతో భారీ సంఖ్యలో అభిమానులని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అందం మాత్రమే సరిపోదు. కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఆ పరంగా చూస్తే అందం ఉన్న ఈ అమ్మడికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. నాని సరసన మజ్ను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది. తన మొదటి సినిమాతోనే అందం, నటనతో ప్రేక్షకులను అలరించింది. వరుస సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ భామ.

అల్లు అర్జున్ తో.. ‘నా పేరు సూర్య,, నా ఇల్లు ఇండియా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత పెద్ద గా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు కెరీర్ పాతాళానికి పడిపోయింది. ఈమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామర్ షోలు చేసినప్పటికీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో చాన్స్ ఇస్తే చాలు స్టోరీ వినకుండానే ఓకే చెప్పేస్తానంటుందట. అందుకేనేమో అను నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఇలాంటి తరుణంలోనే కోలీవుడ్ హీరోను అను ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఓకే అనేశాయట. వచ్చే వేసవిలో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇక ఆ హీరో ఎవరనేది ఇప్పటి వరకైతే క్లారిటీ రాలేదు. దీనిపై అను స్పందిస్తుందేమో చూడాలి మరి.!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here