Bro the Avatar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బ్రో మూవీ మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండే కాకుండా ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ లో మనమంతా గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

ప్రారంభం మొత్తం సాయి ధరమ్ తేజ్ ఉంటాడు. ఆ 40 సెకండ్లు పెద్దగా గమనించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా చాలా తేలికగా అర్థం అయ్యిపోతాది. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ దగ్గర నుండి గమించాల్సినవి చాలా ఉన్నాయి. ముందుగా ఆయన బూట్ల నుండి ఒక పాము వచ్చి బుస కొడుతోంది.ఇది పవన్ కళ్యాణ్ ఎంట్రీ సన్నివేశం అనే విషయం అర్థం అయిపోతుంది.

ఇక ఆ తర్వాత ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ కళ్ళజోడు పెట్టుకొని ఒకసారి,అలాగే వాచ్ మ్యాన్ డ్రెస్ లో ఒకసారి కనిపిస్తాడు. బాగా గమనిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాడు. రిసెప్షన్ దగ్గర , అలాగే వాచ్ మ్యాన్ డ్రెస్ రెండు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాయి. ఇలా డ్యూయల్ లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒకే స్సీఫ్రీన్ మీద కనిపించలేదు. టీన్ మార్ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేసాడు కానీ, అవి రెండు వేరు వేరు కాలాలకు చెందిన పాత్రలు.

కానీ ఇందులో మాత్రం ఆయన మొట్టమొదటిసారి డ్యూయల్ రోల్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపించాడు. ఇది ఫ్యాన్స్ కి నిజంగా ఫీస్ట్ లాంటిది అనే చెప్పాలి. ఇక ట్రైలర్ చివర్లో ‘హాహా..అందుకే చంపేశా’ అనే డైలాగ్ దగ్గర కూడా పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్స్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాడు. ఇది నిజంగా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. అలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను అలరిస్తుందో లేదో చూడాలి.