పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ చిత్రం మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి మొదటి నుండి పెద్దగా హైప్ ఉండేది కాదు, ఎందుకంటే ఈ చిత్రం తమిళ రీమేక్, దానికి తోడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం లేని ఒక మామూలు సినిమా.

పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ఏది కూడా ఈ చిత్రం పై హైప్ పెంచలేకపోయాయి. అందుకే ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న అనితర సాధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో కళ్ళు చెదిరిపోయే రేంజ్ వసూళ్లు వచ్చాయి. అదే తరహా ఊపు ని వీక్ డేస్ లో కూడా కొనసాగించి 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన నాన్ కమర్షియల్ మూవీ కి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారమైన విషయం కాదు. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే, ఈ వీకెండ్ తో క్లోసింగ్ కలెక్షన్స్ కూడా వేసేయబోతున్నారు. ఇక ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక శుభ వార్త. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు, అనగా సెప్టెంబర్ 2 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా, హిందీ లో కూడా ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు రెంట్ సిస్టం లో సినిమాలను స్ట్రీమింగ్ చెయ్యలేదు. కానీ ‘బ్రో ది అవతార్’ చిత్రం నుండి ఆ పద్దతి ని అమలు చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది, చూడాలి మరి.
