Bro the Avatar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ నెగటివ్ గానే వచ్చినప్పటికీ మొదటి మూడు రొఝులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణంగా అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది. కానీ నాల్గవ రోజు మూడవ రోజుకంటే 70 శాతం కి పైగా వసూళ్లు తగ్గాయి.
అలా తగ్గుకుంటూ వచ్చిన ఈ సినిమా వరుస ఆరు రోజుల వరకు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిల్చింది. 7 వ రోజు మాత్రం కోటి రూపాయిల కంటే తక్కువ షేర్ ని రాబట్టింది. ఇక నుండి ఈ సినిమా డైలీ కలెక్షన్స్ లక్షల్లోనే ఉంటాయి. అయితే బయ్యర్స్ కి ఈ వీకెండ్ పై గట్టి నమ్మకాలు ఉన్నాయి. కచ్చితంగా ఈ చిత్రం వీకెండ్ లో మంచి వసూళ్లను రాబడుతుంది అనే నమ్మకం తో ఉన్నారు.
ఇకపోతే ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది. ఏ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ అయ్యింది వంటివి ఇప్పుడు మనం చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్క ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే కర్ణాటక మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ముఖ్యంగా అమెరికా లో అయితే ఈ సినిమాకి వీక్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. కేవలం ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాల నుండే ఈ 12 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.
అలాగే ఈ ‘బ్రో ది అవతార్‘ చిత్రం నైజాం ప్రాంతం లో మొదటి వారం 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, సీడెడ్ లో 6 కోట్ల 50 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 6 కోట్ల 55 లక్షల రూపాయిలు, తూర్పు గోదావరి జీళ్లలో 4 కోట్ల 61 లక్షల రూపాయిలు , పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్ల 20 లక్షల రూపాయిలు , గుంటూరు లో 4 కోట్ల 33 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో మూడు కోట్ల 18 లక్షల రూపాయిలు మరియు నెల్లూరు లో కోటి 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , మొదటి వారం లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం మీద 51 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం 64 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.