Bro the Avatar : నాల్గవ రోజు కంటే 5 వ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టిన ‘బ్రో ది అవతార్’.. లాంగ్ రన్ ఉంటుందా..?

- Advertisement -

Bro the Avatar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొదట్లో టాక్ పెద్దగా రాకపోయినప్పటికీ పక్క రోజు నుండి ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ రేంజ్ కలెక్షన్స్ రాకపోయినా, డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి.

Bro the Avatar
Bro the Avatar

కానీ కొన్ని సైట్స్ కావాలని ఈ చిత్రం పై విష ప్రచారం చేస్తున్నారు. సినిమా కి వసూళ్లు బాగా పడిపోయాయని, 70 కోట్ల రూపాయిల షేర్ కూడా రాదనీ, ఈ చిత్రాన్ని చిన్న సినిమా అయినా బేబీ క్రాస్ చేస్తుంది అంటూ ఇలా పలు రకాల వార్తలు ప్రచారం చేసారు. ఆదివారం తో పోలిస్తే ఈ సినిమాకి సోమవారం రోజు 70 సతాం వసూళ్లు పడిపోయిన విషయం వాస్తవమే.

కానీ అలా పడిపోయినప్పటికీ ఈ చిత్రానికి నాల్గవ రోజు ఎంత వసూళ్లు అయితే వచ్చాయో, ఐదవ రోజు కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చాయి. ఇది లాంగ్ రన్ ని సూచిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. నాల్గవ రోజు రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, ఐదవ రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం కర్ణాటక వంటి ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది.

- Advertisement -

ఈ వీకెండ్ తో ఉభయగోదావరి జిల్లాలు మరియు కృష్ణ జిల్లా కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అమెరికా లో కూడా ఈ చిత్రానికి 15 లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లు వస్తాయని అంటున్నారు. వచ్చిన రేటింగ్స్ కి టాక్ కి ఇవి చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ రేంజ్ వసూళ్లు అయితే కాదు కానీ, ఫుల్ రన్ లో 80 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here