Bro : బ్రో సినిమాకు కొత్త కష్టం.. ఆందోళనలో అభిమానులు

- Advertisement -

Bro : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జులై 28న విడుదలవుతున్న ఈ చిత్ర నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయనే సంగతి తెలిసిందే. అయితే.. ఆంధ్రలో మాత్రం పరిస్దితి వేరే రకంగా ఉన్నట్లు వార్తలు వస్తన్నాయి. ఎగ్జిబిటర్లు అంతెంత రేట్లు పెట్టి తీసుకోవటానికి ‘బ్రో’ మూవీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్తున్నారు. అందుకు కారణం అక్కడ హఠాత్తుగా మొదలైన రాజకీయకారణాలుగా చూపెడుతున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’కు విడుదలకు కష్టాలు తప్పకపోవచ్చు అని వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి భావిస్తున్నారు.

Bro
Bro

ఈ సినిమా కోసం 20 నుంచి 25 రోజల డేట్స్​ ఇచ్చి తన పార్ట్​ షూట్​ను చాలా వేగంగా పూర్తి చేశారు పవన్​. మేకర్స్​​ కూడా అంతే వేగంగా మొత్తం సినిమా చిత్రీకరణను కంప్లీట్​ చేశారు. అయితే ఇప్పుడా ఆ స్పీడ్ కనపడట్లేదు. విడుదల ఇంకా 20 రోజుల సమయమే ఉంది. కానీ ప్రమోషన్స్​లో జోరు కనిపించట్లేదు. ఇప్పటివరకు టీజర్​తో పాటు ఓ సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. అలాగే పవన్​ – సాయికు సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా​ ఇంకా పెండింగ్​లోనే ఉందని సమాచారం అందింది. ప్రస్తుతం పవన్​ ఏపీ రాజకీయాలంటూ వారాహి విజయ యాత్రలో ఖాళీ లేకుండా వరుస షెడ్యూల్స్​తో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో డబ్బింగ్ వర్క్​ అంత త్వరగా పూర్తి అవ్వడం కష్టమే. మరో వారం అయినా ఈజీగా పడుతుంది.

bro-movie teaser
‘బ్రో’ మూవీ

ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్​కు సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారనేది ఎటువంటి సమాచారం కూడా తెలియలేదు. మరోవైపు ఓవర్సీస్​ బయర్స్​ ఈ చిత్రాన్ని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపనట్లు తెలిసింది. ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ ​ చెప్పిన ధరకు అక్కడి వారు కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదట. దీంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓవర్సీస్​లో సొంతంగా రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుందట. కాబట్టి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని సినిమాకు సంబంధించిన సీజీ వర్క్​, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్​ వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రమోషన్స్​లోనూ మరింత వేగం పెంచి ఆడియెన్స్​లో భారీ బజ్ క్రియేట్ చేయాలి. మరి మిగిలి ఉన్న ఈ 20 రోజుల్లో ప్రమోషన్స్ ఎలా చేస్తారో వేచి చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com