BRO Movie : సినిమా అనేది చూసేవారికి ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు కానీ అందులో నటించే యాక్టర్స్ కి అది ఒక ఎమోషన్. సినిమాలోని తమ పాత్రలకు సరిపోయే విధంగా ఉండడం కోసం వాళ్లు తమ వేషభాషలనే కాదు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడానికి వెనకడుగు వేయరు. ఇది వాళ్లకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్ కు నిదర్శనం. కొన్ని చిత్రాలలో దేవుళ్ళ పాత్రను పోషించిన కారణంగా ఆ షూటింగ్ సమయంలో కఠిన దీక్షతో నాన్ వెజ్ ను కూడా పక్కన పెట్టి పూర్తి శాకాహారులుగా మారిన యాక్టర్స్ గురించి తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన చిత్రం బ్రో. జులై 28న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పవన్ దేవుడి పాత్రను పోషించారు. ఈ పాత్ర కోసం పవన్ మాంసం మానడమే కాకుండా షూటింగ్ పూర్తయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఎంతో దీక్షతో నటించారు.
నాగార్జున
అన్నమయ్య ,రామదాసు ,షిరిడి సాయి ఇలా ఎన్నో భక్తి చిత్రాలలో నటించి మెప్పించిన నటుడు నాగార్జున. అటు ఎవర్గ్రీన్ గ్రీకువీరుడు పాత్రలు చేస్తూ ఇటు భక్తుడిగా ,భగవంతుడిగా ఎంతో అద్భుతంగా నటించడం ఒక నాగార్జునకే సొంతం. షిరిడి సాయి షూటింగ్ సమయంలో సాయిబాబా పాత్రలో నటించిన కారణంగా నాగార్జున ఎంతో నియమ నిష్టలతో షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు పూర్తి శాకాహారిగా ఉన్నారు.
అక్షయ్ కుమార్
ఈ బాలీవుడ్ బాడీ బిల్డర్ కూడా ఓ మై గాడ్ 2 లో శివుడి పాత్రలో నటిస్తున్నారు. అందుకే షూటింగ్ పూర్తయ్యేంతవరకు పూర్తి శాకాహారిగా మారిపోయాడట.
అల్లు అర్జున్
దువ్వాడ జగన్నాథం మూవీ లో అల్లు అర్జున్ బ్రాహ్మణ క్యారెక్టర్ లో నటించారు. బ్రాహ్మణ పైన తనకు ఉన్న గౌరవం కొద్దీ ఆ పాత్ర చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా పూర్తి అయ్యేంతవరకు అల్లు అర్జున్ పూర్తి శాకాహారిగా ఉన్నారు.