Rakul Preet Singh : బ్రేకింగ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు అరెస్ట్..

- Advertisement -

Rakul Preet Singh : ఇటీవల కాలంలో బాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ కు నార్కొటిన్ పోలీసులు సమన్లు పంపారు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ తమ్ముడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అతని దగ్గరి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

Rakul Preet Singh Brother Aman Preet Singh And Other VIPs Arrest In Drugs  Case At Hyderabad Rv | Big Breaking.. డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్‌  రకుల్‌ప్రీత్‌ తమ్ముడు.. పలువురు ప్రముఖులు ...

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ తాజాగా డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికినట్లు సమాచారం.. అతన్ని హైదరాబాద్ నార్కొటిన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. అమన్ దగ్గర నుంచి 200 గ్రాముల రూ. 2 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రముఖ సినీ ప్రముఖులతో పాటు , వ్యాపారవేత్తలను, నైజీరీయన్లను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం.

- Advertisement -
Rakul Preet Singh
Rakul Preet Singh

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఈ డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తుంది.. అటు టాలీవుడ్ లో కూడా చాలా మందికి పోలీసులు సమన్లు జారీ చేసారు. ఇప్పుడు రకుల్ తమ్ముడి అరెస్ట్ తో మరోసారి డ్రగ్స్ పేరు ట్రెండ్ అవుతుంది.. ఈ విషయం పై రకుల్ ఎం చెబుతుందో చూడాలి.. కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉందన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ పాప ఇండియన్ 2 సినిమాలో మెరిసింది.. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకున్నట్లు లేదు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here