Balakrishna : నటసింహం బాలయ్య తొలిసారిగా హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ విత్ NBK టాక్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ఈ షో డిజిటల్ వరల్డ్ లో ఓ సెన్సేషన్. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకుని మూడో సీజన్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘అన్ స్టాపబుల్ విత్ NBK 3’ కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అన్ స్టాపబుల్ విత్ NBK 2 చివర్లో నెక్ట్స్ మరో సీజన్ ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. కానీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసిన నిర్వాహకులు ఇప్పుడు సీజన్-3 ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ఓ టాక్ ప్రకారం.. ఆహా టీమ్ ఇప్పటికే ‘అన్ స్టాపబుల్ విత్ NBK 3’ కోసం సన్నాహకాలు మొదలు పెట్టేసిందట. బాలయ్య సైతం అగ్రిమెంట్ మీద సంతకం చేసినట్లు తెలుస్తోంది.

దసరా పండుగ సందర్భంగా ఈ టాక్ షోని గ్రాండ్ గా లాంచ్ చేయాలని భావిస్తున్నారట నిర్వాహకులు. బాలయ్య నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా ఆ టైంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఫస్ట్ ఎపిసోడ్ కి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీలా గెస్ట్ లుగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ‘అన్ స్టాపబుల్’ టాక్ షో బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ సరదా సంభాషణలు, డైలాగ్స్ తో అదరగొట్టేశారు. ఇక ఫస్ట్ సీజన్ లో సినీ సెలబ్రిటీలు మాత్రమే గెస్టులుగా వచ్చారు. ఇక రెండో సీజన్ లో రాజకీయ నాయకులు కూడా వచ్చారు. సీజన్-3 లో మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, కేటీఆర్‌లాంటి ప్రముఖులను గెస్టులుగా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.