కమెడియన్ బ్రహ్మానందం గురించి పరిచయం అక్కర్లేదు ఈయన స్క్రీన్ మీద కనిపిస్తేనే అభిమానులు కేరింతలు కొడతారు. తనదైన కామెడీతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు బ్రహ్మానందం. ఒకప్పుడు బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాకు వెళ్లడం అనవసరం అనేంతగా పేరు తెచ్చుకున్నారు. ఈయన చేసిన సినిమాలుకుగాను గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. అంతలా చరిత్రపుటల్లో, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు బ్రహ్మానందం.

సినిమాల్లో కమెడియన్ల పాత్ర చిన్నదిగానే కనిపించినా.. వారు చేసే కామెడీ, పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాదు. ఈ హాస్యనటులలో కొందరు హీరోలు, హీరోయిన్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మన దేశంలో అత్యంత ధనవంతులైన హాస్యనటుల్లో బ్రహ్మానందం ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఒక్కో సినిమాకు రూ.1 నుంచి 2 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అంతే కాదు అతని ఆస్తుల విలువ దాదాపు రూ.350 కోట్లు ఉండవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. అలా చూస్తే ఇండియాలోనే అత్యంత రిచ్ కమెడియన్ మన బ్రహ్మీయే. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఆయనకి ఇష్టమైన హీరోలు. మహానటి సావిత్రి ఇష్టమైన హీరోయిన్. అదే విధంగా డ్రాయింగ్ అండ్ యాక్టింగ్ అంటే ఇష్టం.

బ్రహ్మానందానికి మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. దాదాపు రూ.350 కోట్ల ఆస్తులు కలిగిన బ్రహ్మానందం హైదరాబాద్ మణికొండలో పంచాయితీ ట్రావెల్స్‌లో దాదాపు రూ.7 కోట్ల విలువైన ది ట్రయల్స్ విల్లాలో ఉంటున్నారు. అదేవిధంగా అప్పుడప్పుడు కనిపిస్తూ తన అభిమానుల్ని ఆనందింప చేస్తున్నారు.

బ్రహ్మానందం తర్వాత ఇండియాలో అత్యంత రిచ్ కమెడియన్ స్థానంలో స్టాండ్-అప్ కామెడీతో కెరీర్‌ను ప్రారంభించిన నటుడు కపిల్ శర్మ ఉన్నారు. తన కామెడీతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టే కపిల్ శర్మ ఆస్తుల విలువ దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. 90వ దశకం నాటి అనేక చిత్రాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్. జానీ లీవర్ ప్రస్తుత విలువ రూ. 225 కోట్లు ఉండొచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి.