బ్రహ్మాజీ హెల్త్ సీక్రెట్ తెలిసింది.. రోజుకు అది అన్ని లీటర్లు తాగుతాడట

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు బ్రహ్మాజీ.. ఇండస్ట్రీలో హీరోగా, కమెడియన్ గా, విలన్ గా విభిన్న పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశాడు. నటన, డైలాగ్ డెలివరీ ఏ విభాగంలోనైనా అద్భుతమైన ఫర్మామెన్స్ ఇవ్వగలడు. ఈయన ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, ఏక్ నిరంజన్, అతడు, మర్యాద రామన్న లాంటివి ఉన్నాయి. వీటిన్నంటిలో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలు చూసి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. గత 20 ఏళ్లుగా దాదాపు అన్న సినిమాల్లోనూ కనీసం చిన్న పాత్రలోనైనా బ్రహ్మాజీ ఉండాల్సిందే.

బ్రహ్మాజీ
బ్రహ్మాజీ

బ్రహ్మాజీ పూర్తి పేరు సత్య వెంకట సుబ్రహ్మణ్య బ్రహ్మాజీరావు. అందరూ ఆయనను షార్ట్ కట్లో బ్రహ్మాజీ అంటారు. ఈయన 1965 ఏప్రిల్ 25న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సామర్లకోటలో జన్మించారు. ఆయనకు నలుగురు అక్కలు, ఒక అన్న ఉన్నారు. ఆయన తండ్రి తహసీల్దారు. బ్రహ్మాజీ ఏలూరులో తన చదువుని పూర్తి చేశారు. అనంతరం సినిమాల్లో అడుగుపెట్టారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి డైరక్షన్లో సింధూరం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఎందుకో నెగటివ్, కామెడీ పాత్రలకే పరిమితమయ్యారు.

ఈ మధ్యే బ్రహ్మాజీ తన పెళ్లి సంచలన విషయాలను బయటపెట్టాడు. అది ఎంత హాట్ టాపిక్ గా నిలిచాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన తనకు సంబంధించిన మరో సీక్రెట్ బయటపెట్టారు. బ్రహ్మాజీ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో యాంకర్ ఓ ప్రశ్న అడిగారు. దానికి బ్రహ్మాజీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాంకర్ ‘మీరు ఇంత యంగ్ గా కనిపించడానికి కారణం ఏంటి అని అడగగా.. నేను ప్రతి రోజూ ఆవు మూత్రం తాగుతాను’ అని చెప్పాడు. బ్రహ్మాజీ చెప్పిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here