Sreeleela : యంగ్ బ్యూటీ శ్రీలీలకు స్టేజ్ పైనే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వార్నింగ్ ఇచ్చారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం స్కంద
. ఇందులో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శనివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్ కు నటసింహం నందమూరి బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. మరోవైపు శ్రీలీల వైట్ కలర్ హాఫ్ శారీలో బ్యూటీఫుల్ గా మెరిసిపోయింది. ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇకపోతే ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. మొదట గెస్ట్ గా వచ్చిన బాలయ్య గురించి గొప్పగా మాట్లాడాడు. అలాగే రామ్ డెడికేషన్ గురించి ప్రస్తావిస్తూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ క్రమంలోనే శ్రీలీల గురించి చెబుతూ..

ఆమె ప్రస్తావన రాగానే గ్లామర్ అని అంటున్నారు.. కానీ, శ్రీలీల పరిపూర్ణమైన ఆర్టిస్ట్. ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావ్ అని అడుగుతాం. శ్రీలీల కనిపిస్తే మాత్రం ఏ హీరోతో చెయ్యట్లేదు అని అడగాల్సి వస్తోంది. ఆమె డేట్స్ దొరకడం కూడా చాలా కష్టమైపోతోంది. ఇలాగే ముందుకెళ్లు కాకపోతే మరీ ఎక్కువగా పరిగెడితే గ్లామర్ దెబ్బతింటుంది జాగ్రత్తగా వెళ్లు అంటూ సుతిమెత్తగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో బోయపాటి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.