Sri Devi : శ్రీదేవిది సహజం మరణం కాదు.. ఇన్నేళ్లకు ఓపెన్ అయిన బోనీకపూర్..

- Advertisement -

Sri Devi : తన అందంతో, అభినయంతో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి మరణం.. తన అభిమానులను మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులనే షాక్‌కు గురిచేసింది. అంత హఠాత్తుగా తను ఎలా చనిపోయింది అంటూ ఒక్కసారిగా అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఇక శ్రీదేవి మరణం గురించి తాజాగా తన భర్త బోనీ కపూర్ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్..

Sri Devi
Sri Devi

‘‘అది నేచురల్ మరణం కాదు. యాక్సిడెంటల్ మరణం. నేను దానిగురించి మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాను ఎందుకంటే నన్ను విచారిస్తున్న సమయంలో దానిగురించి దాదాపు 24 లేదా 48 గంటలు మాట్లాడుతూనే ఉన్నాను. ఇండియన్ మీడియా నుండి చాలా ఒత్తిడి ఉంది కాబట్టి ఇలా చేస్తున్నామని ఆఫీసర్లు స్వయంగా అన్నారు. దీంట్లో ఏ తప్పు జరగలేదని వారే తెలుసుకున్నారు. నేను లై డిటెక్టర్ టెస్ట్‌తో సహా ప్రతీ టెస్టులో పాల్గొన్నాను.

ప్రతీ రిపోర్టులో ఇదొక యాక్సిడెంటల్ మరణం అనే తేలింది. తను ఒక్కొక్కసారి ఆకలితోనే ఉండిపోయేది. అందంగా కనిపించాలని అనుకునేది. ఆన్ స్క్రీన్‌పై అందంగా కనిపించడం కోసం మంచి షేప్‌లో ఉండాలని ఎప్పుడూ తపన పడేది. నాతో పెళ్లి అయిన తర్వాత నుండి పలు సందర్భాల్లో తనకు బ్లాక్ ఔట్స్ కూడా అయ్యాయి. తనకు లో బీపీ సమస్య ఉందని డాక్టర్ ఎప్పుడూ చెప్తుండేవారు.’’ అని శ్రీదేవికి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి బయటపెట్టారు బోనీ కపూర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here