Sridevi : బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోని కపూర్.. ఆయన భార్య దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శ్రీదేవి, బోనీ కపూర్ లు పెళ్లికి ముందు చాలా రోజుల పాటు వారు సీక్రెట్ గా డేటింగ్ చేశారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే బోనీకపూర్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో బోనికపూర్‌కి శ్రీదేవిని ఉన్న ఫళంగా పెళ్లి చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ లోపు ఈ ప్రేమ పక్షులు చాలా ప్రదేశాల్లో విహరించారన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఒక సారి బాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్ అయిన బోని కపూర్ శ్రీదేవి కోసం బాల్కనీ నుంచి కూడా దూకాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఆ సాహసం ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఇటీవల జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించారు.
బేసిక్‌గా శ్రీదేవి ఫోన్లో చాలా తక్కువగా మాట్లాడుతారట. ఇవతల వైపు ఉన్న బోనీ కపూర్ మాత్రమే మాట్లాడుతూ ఉంటే శ్రీదేవి ‘ఊ’ కొడుతూ ఉండేదట. అయితే ఒకరోజు బెంగళూరులో షూటింగ్ చేస్తుండగా శ్రీదేవితో బోనీ కపూర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారట. అలా ఆయన మాట్లాడుతుండగా మాటలు వింటూ వింటూ శ్రీదేవి నిద్రలోకి జారుకుందట. తను లేచే సరికి శ్రీదేవికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్న బోనీ కపూర్ ఉన్న ఫళంగా రాత్రి ముంబై నుంచి ఫ్లైట్ లో బెంగుళూరు వెళ్లిపోయారట. ఇక వెళ్లగానే శ్రీదేవి బోనీ కపూర్ ని చూసి చాలా షాక్ అయింది. అయితే తనకోసం తన టీం అంతా తన రూంకి వస్తుంది చూసి ఉన్న ఫళంగా బోని కపూర్ ను బయటకు వెళ్లిపొమ్మని చెప్పిందట. దీంతో ఎటు వెళ్లాలో అర్థం కాని బోనీ కపూర్ బాల్కనీ నుంచి కిందకు దూకేశారట అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.