‘ఒకే ఒక్కడు’ సినిమాలో బీజేపీ నేత బండి సంజయ్.. ఇన్ని రోజులు ఎవ్వరూ గమనించలేదుగా!

- Advertisement -

సినిమాల్లో రాజకీయ నాయకులూ అప్పుడప్పుడు తళుక్కుమని మెరవడం సర్వసాధారణమే. ఆ రంగుల ప్రపంచం కి ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే. గతం లో ఎంతో మంది అలా చేసారు. అలా తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సినిమాల్లో నటించాడని విషయం చాలా ఎవరికీ తెలియదు. అప్పట్లో సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ యాక్షన్ అర్జున్ తో కలిసి ‘ఒకే ఒక్కడు’ అనే సినిమా తీసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఒకే ఒక్కడు
ఒకే ఒక్కడు

ఈ సినిమా అప్పట్లో తెలుగు మరియు తమిళ భాషల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇక తెలుగు లో అయితే ట్రెండ్ సెట్టింగ్ మూవీ గా నిల్చింది. ఒక్క రోజు సీఎం అనే కాన్సెప్ట్ అప్పట్లో అంతలా ఎక్కింది. ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 60 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉంటుందని అంచనా.

అయితే ఈ సినిమాలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ పార్టీ కి అధినేత గా కొనసాగుతున్న బండి సంజయ్ కూడా ఉన్నాడని కాసేపటి క్రితమే తెలిసిందే. ఆయన అందులో ఉన్నట్టుగా ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కానీ అందులో ఉన్నది నిజమైన బండి సంజయ్ కాదు, అచ్చు గుద్దినట్టు ఆయన పోలికలతో ఉన్నవాడు. ఆయన ఫోటో ని ఒక్కసారి మీరు కూడా క్రింద చూడండి.

- Advertisement -

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచం లో 7 మంది ఉంటారు అని ఇందుకే చెప్తారేమో పెద్దలు. ఇలాంటివి చూసినప్పుడు అవి కచ్చితంగా నిజమే అని నమ్మక తప్పదు. కొంతమంది అయితే ఈ ఫొటోలో ఉన్నది బండి సంజయ్ నిజమే కదా అంటున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ సినిమా విడుదల సమయానికి బండి సంజయ్ యుక్త వయస్సులో ఉన్నాడు. కాబట్టి ఆ ఫోటో లో కనిపిస్తున్న వ్యక్తి కచ్చితంగా బండి సంజయ్ కాదు అని చెప్పొచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here