Pallavi Prashanth : ఇచ్చిన మాట తప్పి తెగ ఎంజాయ్ చేస్తున్న రైతు బిడ్డ… ఛీ కొడుతున్న జనాలు

- Advertisement -

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ గేటు దగ్గరే తిరుగుతూ.. రైతు బిడ్డకు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వాలంటూ పోరాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేయాలని పాపులర్ ఇన్ ఫ్లూయెన్సర్లను వేడుకున్నాడు. దీంతో మొత్తానికి ఈ క్లిప్పింగ్స్ నాగార్జునకు చేరడంతో బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆ షో విజేతగా నిలవడం చకచకా జరిగిపోయాయి.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో పెద్ద హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీగా వచ్చిన మొత్తాన్ని పేద రైతులకు పంచుతానని అన్నాడు. అప్పుడు ఆయనకు ఇది ప్లస్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ కష్టపడి గేమ్ ఆడాడు. అదే సమయంలో రైతుబిడ్డ ట్యాగ్, రైతులకు సహాయం చేస్తానన్న హామీ దాని బాగా కలిసొచ్చి విజేతగా నిలిచాడు. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ విన్నర్ అయ్యాడు. ప్రైజ్ మనీగా పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షలు వచ్చాయి. కానీ మాట ఇవ్వడం తేలిక.. దానిని నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

- Advertisement -

హౌజ్ లో తను గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచి పెడుతా.. ఒక్క రూపాయి కూడా ఉంచుకోనంటూ భారీ డైలాగ్స్ తో ఓటింగ్ పెంచుకున్నాడు. ఆ డైలాగులకు పడిపోయి జనాలు మొత్తానికి స్టార్స్ ను కాదని పల్లవి ప్రశాంత్ ను గెలిపించారు. కానీ రూ. 35 లక్షలు చేజిక్కించుకున్న రైతుబిడ్డ.. ఇప్పటి వరకు కేవలం ఒక్క లక్ష మాత్రమే పంచి పెట్టాడు. అది కూడా గురువు శివాజీ చేతుల మీదుగా అందజేశాడు. ఆ తర్వాత పంపకాల ఊసే లేదు. కానీ గురుశిష్యులు ఇద్దరూ తరుచుగా కలవడం, ఎంజాయ్ చేయడం జరుగుతూనే ఉంది. ఈ వీడియోల కింద తమకు హెల్ప్ కావాలని ఎంత మంది రైతులు కామెంట్లు పెట్టినా రెస్పాన్సే లేదేు. దీంతో జనాలు ఛీ కొడుతున్నారు. ఇలా మాట తప్పడం సిగ్గు చేటంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here