Bigg Boss Telugu 7 దిగ్విజయంగా ఆరు వారాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 7 వ వారం లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియతో హౌస్ చాలా హీట్ వాతావరణం లోకి వెళ్ళింది. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్కు మాత్రం చాలా సరదాగా, ఆసక్తికరంగా ఉండేట్టు సాగిపోయింది.

జిలేబి పురం మరియు గులాబిపురం అని హౌస్ మేట్స్ ని రెండు భాగాలుగా విభజించి కెప్టెన్సీ టాస్కుని నిర్వహించాడు బిగ్ బాస్. ఈ టాస్కు లో ‘జిలేబి పురం’ టీం అత్యధిక గేమ్స్ ని విన్ అయ్యి నెంబర్ 1 స్థానం లో ఉంది. వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చివరిగా ఈ పోటీలో సందీప్ మరియు అర్జున్ మిగిలారని, సందీప్ గెలిచి కెప్టెన్ అయ్యాడని ఒక టాక్ ఉంది. అది ఎంత మాత్రం నిజమో తెలియదు.

ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ చేత కొన్ని సిల్లీ పనులు చేయిస్తూ ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈసారి టేస్టీ తేజా ని శోభ శెట్టి పేరు ని శరీరం లో తనకి ఇష్టమైన భాగం లో పచ్చబొట్టు కొట్టించుకోవాలని చెప్తాడు. బిగ్ బాస్ ఎదో సరదాగా అన్నాడులే అని తేజా ముందు పట్టించుకోలేదు. ఆ తర్వాత కాసేపటికి పోస్ట్ కార్డు పంపిస్తాడు. అందులో మీకు నచ్చిన డిజైన్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు.

టేస్టీ తేజ షాక్ కి గురై బిగ్ బాస్ నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఇప్పుడు ఇలాంటివి చేయించుకుంటే అసలు బాగుండదు , దయచేసి ఆపండి బిగ్ బాస్ అని అంటాడు. అప్పుడు శోభా శెట్టి నా మీద ఎదో గొప్ప ప్రేమ ఉన్నట్టు ఎన్నో కథలు చెప్పావ్, అంతా నటనే అని అంటుంది. అప్పుడు తేజా పెళ్లి చేసుకుంటా అని ఒక్కమాట చెప్పు ఇప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా అని అంటాడు. అలా ఈ చర్చ సాగుతూ ఉంటుంది. మరి తేజా పచ్చ బొట్టు వేయించుకున్నాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.