Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో శివాజీ పాత్ర గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి పెద్ద మనిషి తరహాలో, అందరూ నాకు సమానమే, అందరితో మంచి గా ఉంటాను అనే రేంజ్ బిల్డప్ లు ఇస్తూ వచ్చాడు. కానీ ఇతని వల్లే హౌస్ లో గ్రూప్స్ ఏర్పడ్డాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి రోజు నుండి ఆయన పల్లవి ప్రశాంత్ పట్ల చాలా పాజిటివ్ గా ఉండడం ప్రారంభించాడు.
ప్రతీ విషయం లో అతనికి సపోర్టుగా నిలుస్తూ అతని గెలుపు కోసం పరితపిస్తున్నాడు. ఇందులో శివాజీ కి కలిగే లాభం రాజకీయ మైలేజి. ఆ తర్వాత యావర్ ని కూడా సపోర్టు చేస్తూ వచ్చాడు. అలా ‘స్పై’ టీం గా సోషల్ మీడియా లో శివాజీ టీం బాగా పాపులర్ అయ్యింది. ఈ టీం లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన భోలే, అశ్విని తో పాటుగా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రతికా కూడా జాయిన్ అయ్యింది.
ఇదంతా పక్కన పెడితే శివాజీ మొదటి నుండి అమర్ దీప్ అంటే ఎందుకో ఇష్టం లేదు. అతని ముందు నాకు నీ మీద ఎలాంటి అయిష్టం లేదు అంటూ కవరింగ్ ఇస్తూనే అమర్ దీప్ వెనుక చేరి తన మనసులో ఉన్న విషం మొత్తం కక్కుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఒక రోజుకి శివాజీ అమర్ దీప్ పేరుని కనీసం వంద సార్లు అయినా తల్చుకుంటాడు. ప్రిన్స్ యావర్ మరియు పల్లవి ప్రశాంత్ తో కూర్చొని అమర్ దీప్ ని వెక్కిరిస్తూనే ఉంటాడు. అతనంటే ఎందుకు శివాజీ కి అంత కోపం అంటే, హౌస్ లో శివాజీ మాస్కు ని మొదటి రోజు నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి.
ఈ వారం అయితే నామినేషన్స్ లో అమర్ దీప్ దెబ్బకి శివాజీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో హౌస్ లో అమర్ నామస్మరణం చెయ్యడం మొదలు పెట్టాడు శివాజీ. లేటెస్ట్ గా ఆయన అమర్ దీప్ ని ‘ఐటెం రాజా’ అంటూ పిలవడం మొదలు పెట్టాడు. మరి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇవన్నీ పట్టించుకుంటాడా, లేదా ఎప్పటి లాగానే శివాజీ భజన చేస్తాడా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.