Bigg Boss Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎంత రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగిందో మన అందరికీ తెలిసిందే. నామినేషన్స్ పర్వం దగ్గర నుండి, ‘ఏవిక్షన్ పాస్’ మరియు ‘కెప్టెన్సీ టాస్కు’ వరకు ప్రతీ ఒక్కటి హీట్ వాతావరణం మధ్య నడిచింది. ముఖ్యంగా అమర్ దీప్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మొన్న జరిగిన ఎపిసోడ్ తో ఆయన టాప్ 1 కి ఫిక్స్ అయిపోవచ్చు. ఇక మొదటి నుండి కంటెస్టెంట్స్ అందరినీ డామినేట్ చేస్తూ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ వచ్చిన శివాజీ గ్రాఫ్ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది.
నిన్న నాగార్జున శివాజీ కి కోటింగ్ ఇవ్వడం ఆయనకీ ఒక రకంగా ప్లస్ అయ్యింది, అలాగే మైనస్ కూడా అయ్యింది. అమర్ దీప్ ని బూతులు తిట్టడం శివాజీకి బయట చాలా నెగటివ్ గా వెళ్తుంది అనే విషయాన్నీ నాగార్జున చెప్పుకొచ్చాడు. వచ్చే వారం నుండి శివాజీ ఇది మార్చుకుంటే ఆయన గ్రాఫ్ బెటర్ అవ్వొచ్చు.
ఇకపోతే సండే ఫన్ డే అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సండే కూడా అలా ఫన్ తో సాగిపోయింది. ప్రతీ వారం ఎదో ఎవరో ఒకరు అతిథులుగా విచ్చేసి హౌస్ మేట్స్ తో కాసేపు సరదాగా గడిపి వెళ్తుంటారు. అలా ఈ వారం హీరో శ్రీకాంత్, రాజా శేఖర్ కూతురు శివాత్మిక మరియు వరలక్ష్మి శరత్ కుమార్ విచ్చేసారు. ‘కోటబొమ్మాళి పీఎస్’ మూవీ ప్రొమోషన్స్ కోసం ఆయన బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడు. హీరో శ్రీకాంత్ కి శివాజీ మొదటి నుండి మంచి స్నేహితుడు.
స్టేజి మీదకు వచ్చిన తర్వాత శివాజీ తో కాసేపు మాట్లాడాడు శ్రీకాంత్. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ‘నేను జిమ్ లో శ్రీకాంత్ అన్నని చూసినప్పుడు శివాజీ కంటే చిన్నోడు అనుకున్నాను’ అని అంటాడు. అప్పుడు శ్రీకాంత్ ‘నిజంగానే శివాజీ ని బయట అందరూ అలాగే అనుకుంటున్నారు, మీరంతా కలిసి పెద్దయ్య ని చేసేసారు’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు శివాజీ ‘సార్ డోర్స్ తీశాయండి సార్.. నేను వెళ్ళిపోతా, భరించలేక ఉన్నాను’ అని ఫన్నీ కామెంట్స్ చేసాడు శివాజీ.