Bigg Boss Telugu : మన పెద్దలు ఏదైనా మనకి అదృష్టం తగిలితే ‘అబ్బా నక్క తోక తొక్కి వచ్చాడు రా వీడు’ అంటారు. ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో సందీప్ విషయం లో అదే జరుగుతుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ప్రతీ ఒక్కరు నామినేషన్స్ లోకి వచ్చారు, ఒక్క సందీప్ తప్ప. ప్రతీ వారం ఇతనికి కలిసి వచ్చినట్టు లక్ ఫాక్టర్ ఏ కంటెస్టెంట్ కి కూడా కలిసి రాలేదు.

ఈ సీజన్ ప్రారంభం అయ్యి ఇప్పటి వరకు ఆరు వారాలు పూర్తి అయ్యింది. ఈ 6 వారలో మొదటి వారం ‘పవర్ అస్త్ర’ టాస్కులో గెలుపొంది 5 వారాలు నామినేషన్స్ నుండి తప్పించుకునే ఇమ్యూనిటీ ని సంపాదించాడు. ఇక ఆరవ వారం లో సందీప్ కి నామినేషన్స్ పడ్డాయి, కానీ సీక్రెట్ రూమ్ లోపలకి వెళ్లి కొత్త పవర్ తో వచ్చిన గౌతమ్ కృష్ణ సందీప్ ని సేవ్ చేస్తాడు.

కనీసం ఈ వారం అయినా ఆయన నామినేషన్స్ నుండి తప్పించుకోకుండా ఉంటాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క ప్రశాంత్ తప్ప సందీప్ ని ఎవరు నామినేట్ చెయ్యలేదు. కేవలం ఒకేఒక్క ఓటు రావడం వల్ల అతనిని బిగ్ బాస్ నామినేషన్స్ నుండి తప్పించాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ చరిత్ర లో అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరకు వరుసగా 7 వారాలు బిగ్ బాస్ హౌస్ నుండి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్ గా సందీప్ చరిత్ర సృష్టించాడు.

కానీ ఇది ఆయనకీ చాలా పెద్ద నెగటివ్ కానుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కానీ సందీప్ కి అంత ఫ్యాన్ బేస్ ఉండదు అని చెప్పొచ్చు. ఇన్ని వారాలు రాకుండా ఇప్పుడు ఒక్కేసారి నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి రాబొయ్యే రోజుల్లో సందీప్ అదృష్టం ఏంటో చూడాలి.