Bigg Boss Telugu 7 : పల్లవి ప్రశాంత్ కి వెన్నుపోటు పొడిచిన శివాజీ.. ట్విస్ట్ మామూలు రేంజ్ లో లేదుగా!

- Advertisement -

Bigg Boss Telugu 7 ఊహించని మలుపులతో ఎంత ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాము. ఈ సీజన్ ప్రారంభం నుండి ఎవరు ఏమనుకున్నా మొదటి నుండి పల్లవి ప్రశాంత్ కి శివాజీ సపోర్ట్ ఇస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని వల్ల ఆయన ఎన్ని మాటలు పడాల్సి వచ్చినా పడ్డాడు. వాస్తవానికి శివాజీ అందరి పట్ల ఒకేలా ఉన్నాడు కానీ పల్లవి ప్రశాంత్ విషయం లో మాత్రం కాస్త ఎక్కువ అన్నమాట.

Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7

ఎందుకంటే అతను కామన్ మ్యాన్ కాబట్టి, ఇక్కడికి వచ్చిన రోజు నుండి హౌస్ మేట్స్ అందరూ అతనిని టార్గెట్ చేసారు కాబట్టి , శివాజీ ప్రశాంత్ వైపు తీసుకున్నాడు అని అనుకున్నారు అందరూ. కానీ శివాజీ ఇప్పుడు మెల్లగా పల్లవి ప్రశాంత్ కంటే తనకే ఎక్కువగా టాప్ 5 లో నిలబడే అర్హత ఉందని జనాలకు అనిపించేలా చేస్తున్నాడు.

Shivaji Pallavi Prashanth

ప్రతీ విషయానికి ప్రశాంత్ శివాజీ మీద ఆధారపడుతున్నట్టు, అతను లేకపోతే ప్రశాంత్ కి బిగ్ బాస్ లో ఇన్ని రోజులు కొనసాగేంత సత్తా ఉండేది కాదు అన్నట్టుగా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీని ఫలితమే ఇప్పుడు ఓటింగ్ లైన్ లో శివాజీ యావర్ మీద పై చెయ్యి సాధించేలా చేసింది. మొదటి రెండు వారాల్లో శివాజీ కంటే ఎక్కువగా ప్రశాంత్ ఓట్లు వచ్చేవి, కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇదంతా శివాజీ గేమ్ ప్లాన్ అనుకోవాలా?, కావాలనే స్ట్రాటజీ తో ఆడుతూ ప్రశాంత్ కి వెన్ను పోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు నెటిజెన్స్.

- Advertisement -
Bigg Boss

ప్రశాంత్ చాలా కస్టపడి ఆడి కెప్టెన్సీ ని గెలుచుకున్నాడు. కానీ ఇదంతా తానూ త్యాగం చెయ్యడం వల్లే వచ్చింది అంటూ నిన్న ఎపిసోడ్ లో ప్రాజెక్ట్ చేసాడు. కెప్టెన్సీ టాస్కు ఎందుకు వాడి కోసం త్యాగం చేసారు అని అమర్ దీప్ శివాజీ ని అడిగితే, అప్పుడు శివాజీ నాకు భుజం నొప్పి,నేనెలా ఆడుతాను అందుకే వదిలేసా అని చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంత్ మీద ప్రేమతో వదిలేసినట్టు చెప్తున్నాడు. శివాజీ స్మార్ట్ ప్లే ని గమనించకపోతే, ప్రశాంత్ బలిపశువు అవ్వడం ఖాయం అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here