రెండో వారం నామినేషన్స్‌లో పల్లవి ప్రశాంత్ ను హౌస్ మెంబర్స్ అందరూ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమర్ దీప్.. ‘నీకే అంత ఉంటే.. నాకెంత ఉండల్రా’ అంటూ ఓ రేంజ్ లో పల్లవి ప్రశాంత్ పై రెచ్చిపోవడంతో జనాలు అతడిపై మండిపడుతున్నారు. ఓ వైపు ప్రశాంత్ కూడా పుష్పరాజ్ మాదిరిగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు… ‘అన్నా అన్నా’ అంటూ మర్యాదగానే మాట్లాడారు. కానీ అతన్ని నామినేట్ చేయడానికి వచ్చిన వారంతా.. పల్లవి ప్రశాంత్.. రారా పోరా ఏరా అంటూ సంబోధించారు. హౌసులో పల్లవి ప్రశాంత్‌ని టార్గెట్ చేయడం అప్పటికప్పుడే జరిగింది కాదు. పక్కా స్కెచ్ వేసి మరీ చెక్ పెట్టారన్న సంగతి లైవ్ ఎపిసోడ్లో స్పష్టంగా తెలిసింది. నిజానికి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు.. అతడిని చూసి భయపడ్డారు అమర్ దీప్, ఆట సందీప్‌లు. బిగ్ బాస్ ఆట మొదలైన రోజు.. నైట్ మిగిలిన కంటెస్టెంట్స్ అంతా పడుకున్నారు కానీ.. అమర్ దీప్, ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, రతికలు మాత్రం నిద్రపోకుండా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ అవుతున్నాడనే విషయాన్ని వారంతా ముందే పసిగట్టారు. అప్పుడే ఈ పర్సనల్ ఎటాక్‌కి బీజం పడినట్లు తెలుస్తోంది.
ఆ రాత్రి వాళ్లు.. ‘ప్రశాంత్‌ని చూస్తుంటే.. ప్రళయం వచ్చే ముందు ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో పల్లవి ప్రశాంత్ నాకు అలా కనిపిస్తున్నాడు.. మనోడు ఫోకస్డ్గా ఉన్నాడు’ అన్నాడు. ఆ మాట ప్రశాంత్‌కి వినిపించి.. ‘అబ్బే అదేం లేదు సార్’ అని నవ్వుకున్నాడు. అక్కడే ఉన్న అమర్ దీప్.. నాకు డౌటే.. నాకూ ఏదో తేడా కొడుతుంది.. నువ్వు మామూలోడివి కాదు’ అని అన్నాడు. వీళ్ల సంభాషణలో పల్లవి ప్రశాంత్‌ని చూసి.. అమర్ దీప్, ఆట సందీప్ భయపడ్డారని అప్పుడే అర్థం అవుతోంది. నిన్నటి నామినేషన్స్‌లో అమర్ దీప్.. శివాజీని నామినేట్ చేయడానికి చెప్పిన పనికిమాలిన రీజన్ ఏంటంటే.. పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ అని చెప్పడమే. సో.. పల్లవి ప్రశాంత్‌ని టార్గెట్ చేయడం అప్పటికప్పుడు జరిగింది కాదు. అతను హౌస్‌లోకి రోజే… అమర్ దీప్, ఆట సందీప్‌లు తన సీరియల్ బ్యాచ్‌ని పోగు చేసి.. పల్లవి ప్రశాంత్‌పై పర్సనల్ ఎటాక్ చేశాడు అమర్ దీప్. వీరికి గౌతమ్, టేస్టీ తేజాలాంటి వారు తోడు కావడంతో.. రైతు బిడ్డను తొక్కిపడేశారు.