Pallavi Prashanth : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సామాన్య రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడమే కాకుండా, టైటిల్ ని కూడా గెలవడం జరిగింది. ఇది ప్రతీ రైతు బిడ్డ గర్వించదగ్గ విషయం. ఇక అతని తల్లిదండ్రులకు ఎంత అనందం కలిగి ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ ఆనందం ని మనమంతా కళ్లారా చూసాము. కానీ బిడ్డ టైటిల్ గెలిచాడు, ఇంత పేరు సంపాదించాడు అనే సంతోషం ఆ తల్లితండ్రులకు కనీసం 24 గంటలు కూడా లేదు.
![Pallavi Prashanth](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-649-1024x576.png)
పల్లవి ప్రశాంత్ చేసిన మూర్ఖపు చర్య వల్ల మీడియా ముందుకు వచ్చి కూర్చొని ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. టైటిల్ గెలిచిన పోలీసుల రూల్స్ కి విరుద్ధంగా ర్యాలీ చెయ్యడమే కాకుండా, వాళ్ళని ఎదిరించడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేలా శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం , బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై దాడులు చెయ్యడం, వీటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని పల్లవి ప్రశాంత్ పై నాన్ బైలబుల్ కేసులు నమోదు అయ్యాయి.
![Bigg Boss Telugu](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-650-1024x576.png)
నిన్న రాత్రి ఆయనని చంచల్ గూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. 14 రోజుల పాటు అక్కడే రిమాండ్ లో ఉండాలి. ఇదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ ఘటన కారణంగా బిగ్ బాస్ షో కూడా రిస్క్ లో పడింది. ఆరోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన విపత్కర సంఘటనలకు బిగ్ బాస్ యాజమాన్యం ని కూడా భాద్యుల్ని చేసారు పోలీసులు.
![Bigg Boss Pallavi Prashanth](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-651.png)
ఆ షో మీద కూడా కేసు నమోదు అవ్వడం తో త్వరలోనే ప్రారంభించాలి అనుకున్న బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఓటీటీ వెర్షన్ మాత్రమే కాదు, తదుపరి టెలివిజన్ సీజన్ కూడా ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. పల్లవి ప్రశాంత్ వల్ల ఇంత నష్టం జరిగింది కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం ఆయన నుండి కప్, ప్రైజ్ మనీ, కార్ మరియు జాయ్ అలుకాస్ నగలు మొత్తం వెనక్కి ఇచ్చేయమని అంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.