Bigg Boss Sivaji : చాలా కాలం తర్వాత ప్రయోగాత్మక చిత్రాలను పక్కన పెట్టి కమర్షియల్ సినిమా తో అక్కినేని నాగార్జున రీసెంట్ గా ‘నా సామి రంగ’ చిత్రం తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ వైబ్స్ తో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.
వరుసగా మూడు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని ఇక కెరీర్ అయిపోయింది అంటుకుంటున్న సమయం లో నాగార్జున కి ‘నా సామి రంగ’ చిత్రం మళ్ళీ కొత్త ఊపిరి పోసింది అనే చెప్పాలి. అక్కినేని అభిమానులు చాలా కాలం తర్వాత మంచి జోష్ మీద ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.
సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే దానికి అల్లరి నరేష్ పాత్ర ప్రభావం చాలా గట్టిగా ఉందనే చెప్పాలి. గమ్యం సినిమా తర్వాత ఆ రేంజ్ క్యారక్టర్ ఆయనకీ ఇందులో పడింది. అయితే ఈ పాత్ర కోసం బిగ్ బాస్ శివాజీ ఆ చిత్ర రైటర్ ప్రసన్న ని తనకి ఆ పాత్రని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసాడట. కథ నాకు ముందుగానే తెలిసిందని, ప్రసన్న ని అల్లరి నరేష్ పాత్రని తాను చేస్తాను, బాబుగారికి రికమెండ్ చెయ్యండి అని అడిగాను అంటూ రీసెంట్ గా నాగార్జున తో శివాజీ చేసిన ఇంటర్వ్యూ లో శివాజీ చెప్పుకొచ్చాడు.
అయితే శివాజీ కి అంత పవర్ ఫుల్ పాత్రని మోసేంత స్టేటస్ అప్పట్లో అయితే లేదు. ఈ చిత్రం లో అల్లరి నరేష్ క్యారక్టర్ నాగార్జున తో సమానంగా ఉంటుంది. శివాజీ ని బిగ్ బాస్ కి ముందు నాగార్జున తో సమానమైన క్యారక్టర్ ఇస్తే జనాలు ఒప్పుకోరు. అందుకే బహుశా డైరెక్టర్ శివాజీ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసాడేమో అని అనుకుంటున్నారు నెటిజెన్స్.