Bigg Boss Shivaji : ముక్కుసూటి తత్త్వం తో మనసులో ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టే రేంజ్ లో మాట్లాడే శివాజీ ని మనం బిగ్ బాస్ ని చూసాం. మన చిన్న తనం నుండి ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆ సినిమాల ద్వారా ఆయనకీ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో చెప్పలేం కానీ, బిగ్ బాస్ షో ద్వారా మాత్రం ఆయనకీ ఊహించని రేంజ్ లో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఆ స్థాయిలో ఆయన మైండ్ గేమ్ తో షోని అల్లాడించాడు.

బిగ్ బాస్ షో కి వెళ్లే ముందు శివాజీ ఈటీవీ విన్ యాప్ కోసం ’90s: మిడిల్ కాల్స్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్ చేసాడు. ఈ సిరీస్ రీసెంట్ గానే టెలికాస్ట్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సిరీస్ ని చూసిన ప్రతీ ఒక్కరు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఈ సిరీస్ ప్రొమోషన్స్ కోసం రీసెంట్ గా శివాజీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత శివాజీ బాగా సంపాదించాడు అని ఒక రూమర్ ఉంది. అది నిజమేనా?’ అని అడగగా, దానికి శివాజీ సమాధానం చెప్తూ ‘నేను రాజకీయాల్లోకి ప్రజల గొంతుగా ఉండాలని మాత్రమే వచ్చాను. నేను ఏ రాజకీయ పార్టీ దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా’ అని సవాలు విసిరాడు.

యాంకర్ దానికి కొనసాగింపు ప్రశ్న వేస్తూ ‘మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా?’ అని అడుగుతాడు. దానికి శివాజీ సమాధానం చెప్తూ ‘ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సినిమాల పైనే, రాజకీయాలకు ఇక సెలవు. కానీ ప్రజల గొంతుగా వాళ్ళకోసం ఎప్పుడూ ముందు ఉంటాను. నేను ఏ రాజకీయ పార్టీ పైన విమర్శలు చెయ్యను. ఒకవేళ నా మీద విమర్శలు చేస్తే మాత్రం నేను ఆ రాజకీయ పార్టీ కి అడ్డంగా వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.
