Bigg Boss 8 : ‘బిగ్ బాస్ 8’ లోకి సామాన్యుడు అడుగుపెట్టాలంటే ఎంత డబ్బులు కట్టాలో తెలుసా..? బయటపడ్డ సంచలన నిజాలు!

- Advertisement -

Bigg Boss 8  కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ వచ్చే నెలలో గ్రాండ్ గా టెలికాస్ట్ కాబోతుంది. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వివరాలు ఇది వరకు మీరు చాలానే చూసుంటారు. కానీ అది కేవలం రూమర్స్ మాత్రమే. ఇప్పటి వరకు ఇంకా ఏ కంటెస్టెంట్ కూడా సంతకం చెయ్యలేదు కానీ పలువురి సెలబ్రిటీస్ ని మాత్రం బిగ్ బాస్ టీం కలిసిన విషయం వాస్తవం. వారిలో తేజస్విని గౌడ , ఇంద్ర నిల్, గాయత్రీ గుప్తా, ప్రభాస్ శ్రీను, యాంకర్ వింధ్యా తదితరులు ఉన్నారు. ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ ని కూడా బిగ్ బాస్ టీం కలిసినట్టు వార్తలు వినిపించాయి కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Bigg Boss 8
Bigg Boss 8

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సీజన్ కి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో కామెడీ సత్య కూడా కనిపిస్తాడు. ఒక్కసారి కమిట్ అయితే , లిమిట్ ఉండదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంటే ఈసారి సీజన్ లో అన్ లిమిటెడ్ టాస్కులు, అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ప్రతీ సామాన్యుడు బిగ్ బాస్ యాజమాన్యం కి ఎంతో కొంత డబ్బులు కట్టి లోపలకి కంటెస్టెంట్ గా అడుగుపెడతారు అనే టాక్ ఎప్పటి నుండో ఉండేది. కానీ బిగ్ బాస్ టీం కి సంబంధించిన వాళ్ళెవ్వరు కూడా సామాన్యుల నుండి డబ్బులు తీసుకోరు.

Bigg Boss 8 Telugu Latest Promo | Bigg Boss 8 Telugu Promo | Bigg Boss 8 Telugu Today Promo #bb8

- Advertisement -

అంతే కాదు సీఎం రెకమెండేషన్ ఉన్నా కూడా బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్స్ గా తీసుకునేందుకు అంగీకరించరు. అయితే బిగ్ బాస్ టీం కొంతమంది పీఆర్ లను హౌస్ లోకి అడుగుపెట్టి మంచి కంటెంట్ ఇచ్చే సెలెబ్రిటీల లిస్ట్ పంపమంటారు. దీనిని అదనుగా వాడుకొని ఆ పీఆర్లు కొంతమంది సామాన్యుల వద్ద అధిక మొత్తం మీద డబ్బులు దోచేసి మోసం చేస్తున్నారని బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన ఆదిరెడ్డి తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

Bigg Boss 8 Telugu: Starting Date & Time, Contestants List & Host | Bigg Boss Telugu Season 8 Latest Updates | Bigg Boss 8 Telugu This Week Nominations and Emanations – FilmiBeat

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here